Reliance Jio: రిలయన్స్ జియోకు ఆరేళ్లు.. డిజిటల్ విప్లవంలో కీలకపాత్ర.. త్వరలో 5జీ సేవలు

దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభమై సోమవారానికి ఆరేళ్లు. తక్కువ ధరలోనే డేటా, వాయిస్ కాల్స్ అందిస్తూ సరికొత్త విప్లవానికి తెరతీసింది జియో. వచ్చే దీపావళికి 5జీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Reliance Jio: రిలయన్స్ జియోకు ఆరేళ్లు.. డిజిటల్ విప్లవంలో కీలకపాత్ర.. త్వరలో 5జీ సేవలు

Reliance Jio: రిలయన్స్ జియో ప్రారంభమై సోమవారానికి (సెప్టెంబర్ 5) ఆరేళ్లు పూర్తవుతాయి. డేటా వినియోగం భారంగా ఉన్న రోజుల్లో, వాయిస్ కాల్స్‌కు భారీ చార్జీలను మొబైల్ నెట్‌వర్క్ సంస్థలు వసూలు చేసే రోజుల్లో ఔట్ గోయింగ్ కాల్స్ ఉచితంగా అందిస్తూ, తక్కువ ధరలోనే మొబైల్ డేటా అందిస్తూ సరికొత్త విప్లవానికి నాంది పలికింది జియో. ఉచిత కాల్స్ ఫలితంగా మొబైల్ బిల్లులు కూడా భారీగా తగ్గాయి. దీంతో ఇతర సంస్థలు కూడా దిగొచ్చి, ధరలు తగ్గించాల్సి వచ్చింది. డేటా వినియోగంలోనూ టెలికాం రంగంలో భారీ మార్పులు తెచ్చింది జియో. ఈ సంస్థ ప్రారంభించక ముందు, ప్రతి భారతీయ కస్టమర్ ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు డేటా వినియోగం 100 రెట్లు పెరిగి ఒక చందాదారునికి నెలకు 15.8 జీబీ స్థాయికి చేరుకుంది. మరోవైపు, జియో వినియోగదారులు ప్రతి నెలా దాదాపు 20 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారు. వచ్చే దీపావళి నుంచి 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే డేటా వినియోగం మరింతగా పెరుగుతుంది. జియో భారతదేశంలో 413 మిలియన్ల మొబైల్ కనెక్షన్లు, 7 మిలియన్ల జియోఫైబర్ కస్టమర్లతో 36 శాతం మార్కెట్ వాటాను సాధించింది.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

చవకైన డేటా
జియో అందుబాటులోకి వచ్చాక డేటా వినియోగం పెరిగితే, ఛార్జీలు తగ్గాయి. జియో ప్రారంభించే సమయానికి దేశంలోని మొబైల్ వినియోగదారులు ఒక జీబీ డేటా కోసం దాదాపు రూ. 250 చెల్లించాల్సి వచ్చేది. ఈ ధరల్ని జియో తగ్గిస్తూ రావడం వల్ల ప్రస్తుతం 1 జీబీ డేటా రూ.13 కే లభిస్తోంది. అంటే 6 ఏళ్లలో డేటా ధరలు దాదాపు 95 శాతం తగ్గాయి. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా డేటా ధరలు భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయి.
డిజిటల్ ఎకానమీకి వెన్నెముక
భారతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు రిలయన్స్ జియో వెన్నెముకగా నిలుస్తోంది. జియో అందిస్తున్న చౌక డేటా దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది. Jio ప్రారంభించిన సమయంలో అంటే సెప్టెంబర్ 2016లో యూపీఐ ద్వారా 32.64 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇప్పటి లావాదేవీల విలువ రూ. 10.72 లక్షల కోట్లు.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

యునికార్న్ కంపెనీల వరద
నేడు భారతదేశం 105 యునికార్న్ కంపెనీలకు నిలయంగా ఉంది. వీటి విలువ 338 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. జియో లాంచ్‌కి ముందు భారతదేశంలో కేవలం 4 యునికార్న్ కంపెనీలు మాత్రమే ఉండేవి. వాస్తవానికి 1 బిలియన్ డాలర్ల నికర విలువ దాటిన స్టార్టప్‌లను యునికార్న్ కంపెనీలు అంటారు.
జియో 4జీ ఫీచర్ ఫోన్
4జీ టెక్నాలజీతో పనిచేసే ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేయలేని వారి కోసం, అలాగే కీ ప్యాడ్ ఉండే ఫోన్లు ఉపయోగించాలనుకునే వారి కోసం జియో సంస్థ దేశంలో మొదటిసారిగా 4జీ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది.
జియో ఫైబర్
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడింది జియో ఫైబర్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్, ఇ-షాపింగ్ వంటి వాటి కోసం జియో ఫైబర్ ఎంతగానో ఉపయోగపడింది. కేవలం మూడేళ్లలో 70 లక్షల క్యాంపస్‌లు జియో ఫైబర్‪కు కనెక్ట్ అయ్యాయి.