Sexual Harassment :‘స్కిన్‌ టు స్కిన్‌’జరిగితేనే లైంగిక వేధింపులు..లేకుంటే కాదు అనటం చాలా దారుణం : సుప్రీంకోర్టు

లైంగిక వేధింపులను బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కిన్‌ టు స్కిన్‌ తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది.

Sexual Harassment :‘స్కిన్‌ టు స్కిన్‌’జరిగితేనే లైంగిక వేధింపులు..లేకుంటే కాదు అనటం చాలా దారుణం : సుప్రీంకోర్టు

Skin To Skin Condition Disastrous For Sex Assault Cases

skin-to-skin-condition-disastrous-for-sex-assault-cases : లైంగిక వేధింపులను బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలి అని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడినవారు బాధితుల శరీరాన్ని తన శరీరంతో తాకితేనే లైంగిక వేధింపులు అని అలా కాకుండా పలు రకాలుగా వేధించినా అవి లైంగిక వేధింపులు అని అనటం సరికాదు అని..ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్‌ టు స్కిన్‌) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక విషయాలను స్పష్టీకరిచింది.

Read more : Prince Andrew : బ్రిటన్ యువరాజుపై లైంగిక వేధింపుల కేసు
ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతు కొన్ని కీలక విషయాలను స్పష్టం చేసింది. శరీరానికి శరీరం (స్కిన్‌ టు స్కిన్‌) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది.

లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని..అవి అశ్లీలం ప్రదర్శనలు కావచ్చు..అశ్లీల వీడియోలు చూపించటం కావచ్చు..తన శరీరంతో రకరకాల సైగలు చేయటం..అసభ్యంగా మాట్లాడటం..వెకిలిగా ప్రవర్తించటం వంటి పలు అంశాలను సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

Read more : చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు షాకింగ్ కామెంట్స్ : అవి వేధింపులు కాదు..పోక్సో చట్టం కిందకు రావు

వీటిపై సుప్రీంకోర్టు గురువారం (సెప్టెంబర్ 30,2021)విచారణ చేపట్టిన సందర్భంగా ఇటువంటి కీలక విషయాలను స్పష్టంచేసింది ధర్మాసనం. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్‌ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని సెక్షన్‌7 చెబుతోంది.