Farmers: 702మంది రైతులు అమరులయ్యారు

జూన్‌ 5, 2020 వ్యవసాయ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

Farmers: 702మంది రైతులు అమరులయ్యారు

Farmers

Farmers: జూన్‌ 5, 2020 వ్యవసాయ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. దీంతో మూడు చట్టాలకు వ్యతిరేకంగా అన్నం పెట్టే అన్నదాత న్యాయం కోసం రోడ్డెక్కాడు. పట్టు విడవకుండా ఉక్కు సంకల్పంతో ఎముకల కొలికే చలిని సైతం లెక్కజేయకుండా ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్లనే తాత్కాలిక నివాసాలు చేసుకొని.. రోడ్లపైనే భోజనాలు చేస్తూ.. 15 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు రైతులు, రైతు సంఘాల నాయకులు.

రోజుకో తీరుగా తమ పోరాటాన్ని కొనసాగించగా.. ఎట్టకేలకు కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చింది అన్నదాత ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే, ఆందోళనలు మాత్రం రైతులు విరమించలేదు.. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, అందుకు సంబంధించిన డేటా మా వద్ద లేదంటూ కేంద్రం ప్రకటించింది. దీంతో రైతులు కేంద్రం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tribal Woman Fight : బిడ్డ కోసం తల్లి సాహసం.. ఒంటి చేత్తో చిరుతపై పోరాటం

ఈ క్రమంలోనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్‌ మోర్చా(SKM) కేంద్రప్రభుత్వానికి పంపించింది. రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని, పరిహారం ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం లోక్‌సభలో చెప్పగా.. రైతులు ఈ చర్యకు పూనుకొన్నారు.

మద్దతు ధర చట్టం, అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ డిమాండ్లపై కేంద్రంతో చర్చించేందుకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ వెల్లడించారు. ప్యానెల్‌లో రైతు నేతలు.. బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివ్‌ కుమార్‌ కక్కా, గుర్నామ్‌ సింగ్‌, యుద్ధవీర్‌ సింగ్‌ ఉన్నారు.

ABP C-Voter Survey: ఇండియన్ మినీ పోల్స్.. ఉత్తరప్రదేశ్‌లో అధికారం ఎవరిది?