India : ఊపిరి పీల్చుకొనే శుభవార్త

కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది.

Covid – 19 Cases : కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 4 లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే..గత 24 గంటల్లో 2, 81, 386 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 1,01,461 యాక్టివ్ కేసులు తగ్గాయి. అయితే..మరణాల సంఖ్య కొంత ఆందోళన కలిగిస్తోంది.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4 వేల 106 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 35 లక్షల 16 వేల 997 యాక్టివ్ కేసులున్నాయి. 3, 78, 741 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 84.25 శాతంగా ఉండడం గమనార్హం. మరణాల రేటు 1.09గా ఉంది. ఢిల్లీ, యూపీ, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖంఢ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏపీ, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమౌతున్నాయి.

  • మృతుల సంఖ్య 2,74,390గా ఉంది.
  • దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076 మంది కోలుకున్నారు.
  • 35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.
  • దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.

ట్రెండింగ్ వార్తలు