Gold Smugglers : గోల్డ్ ఛైన్ ను తీసుకెళుతున్న చీమలు, అరెస్టు చేశారా ?

కొన్ని చీమలు బంగారం గొలుసును తీసుకెళుతుంటాయి. ఈ వీడియోకు స్మాలెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ అని పేరు పెట్టారు.

Gold Smugglers : గోల్డ్ ఛైన్ ను తీసుకెళుతున్న చీమలు, అరెస్టు చేశారా ?

Smallest Gold

Dipanshu Kabra : ఏదైనా వస్తువును చోరీ చేస్తే..పోలీసులు కేసు బుక్ చేస్తారు. వారి దొంగిలించిన వస్తువును స్వాధీనం చేసుకుని..కటకటాల్లోకి నెట్టేస్తుంటారు. ఎక్కువగా విలువైన వస్తువులు అంటే..బంగారం, నగలు, ఇతరత్రా ఖరీదైన వాటిని తస్కరిస్తుంటారు. అయితే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో రచ్చ రచ్చ చేస్తోంది. బంగారం గొలుసును చీమలు తీసుకపోతున్న వీడియో నవ్వులు పూయిస్తోంది.

ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి Dipanshu Kabra ఐపీఎస్ అధికారి..ట్విట్టర్ వేదికగా..పలు వీడియోలను పోస్టు చేస్తుంటారు. అందులో కొన్ని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. మరికొన్ని సరదగా ఉంటాయి. 2021, మార్చి 24వ తేదీన ఓ వీడియోను పోస్టు చేశారు.

కొన్ని చీమలు బంగారం గొలుసును తీసుకెళుతుంటాయి. ఈ వీడియోకు స్మాలెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ అని పేరు పెట్టారు. 15 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. బంగారం గొలుసును తీసుకెళుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు. పలువురు సైటెర్లు వేశారు. దొంగ చీమలను అరెస్టు చేశారా ? లేక అవి తప్పించుకున్నాయా ? అంటూ హాస్యమాడారు.

Read More : vidaai : అత్తారింటికి కారు నడుపుకుంటూ వెళ్లిన వధువు, వీడియో వైరల్