సన్నటి మెట్లు ఎక్కేసిన స్మార్ట్ ఎలిఫెంట్ వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 06:07 AM IST
సన్నటి మెట్లు ఎక్కేసిన స్మార్ట్ ఎలిఫెంట్ వైరల్ వీడియో

ఓ ఏనుగు తెలివితేటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ ఏనుగు రోడ్డు దాటేందుకు అటూ ఇటూ చూసింది. కానీ నిదానంగా ఉండే ఏ దారి దానికి కనిపించలేదు. దీంతో సన్నగా ఉన్న మెట్లదారిలో చాకచక్యంగా ఎక్కుతూ..అటుగావైపు వెళతున్న వాహనాన్ని చూస్తుంది.

ఆ తరువాత  దీనిపై స్పందించిన ఫారెస్ట్ ఆఫీసర్ కాస్వాన్..  ‘ఆ ఒక్క చూపే అంతా చెప్పేస్తోంది’ అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ‘ఏనుగు పడిపోతుందేమోనని భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు. మానుషులు సృష్టించిన అడ్డంకులను తన తెలివితేటలతో సునాయసంగా అధికమించింది. అయితే అసలు జంతువులు ఇటువంటి ఇబ్బందలు ఎదుర్కోకుండా చూడాల్సిన బాధ్యత మనమీద ఉంది’ అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఏనుగు మెట్లు ఎక్కటం పెద్ద విశేషంకాదు కానీ..ఏనుగు ఉండే ఆకారానికి అంత సన్నిటి మెట్లు ఎక్కటం విశేషం. ఎందుకంటే భారీ ఆకారంలో ఉండే ఏనుగు  అంత సన్నపాటి మెట్లను అతి జాగ్రత్తగా నిదానంగా ఎక్కటంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిదానమే ప్రధానం అన్నట్లుగా వ్యవహరించిన ఆ భారీ ఏనుగు జాగ్రత్తకు ఫిదా అవుతున్నారు.