Smash 2000 : గాల్లో తిరిగే ఏకే 47 రైఫిళ్లు, ఉగ్రవాదులకు దబిడి దిబిడే

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది. స్పీడుగా ఆకాశంలో వెళ్లే డ్రోన్లను నేలమట్టం చేయాలంటే..కొంత కష్టమన పనే.

Smash 2000 : గాల్లో తిరిగే ఏకే 47 రైఫిళ్లు, ఉగ్రవాదులకు దబిడి దిబిడే

Drone

Smash 2000 : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది. స్పీడుగా ఆకాశంలో వెళ్లే డ్రోన్లను నేలమట్టం చేయాలంటే..కొంత కష్టమన పనే.

తుపాకులతో వాటిని కూల్చడం కష్టమైన పని అని, వీటికి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో ఈ వ్యవస్థను వినియోగిస్తున్నాయి. రాడార్, ఆప్టికల్, థర్మల్‌ ఇమేజింగ్‌ ద్వారా నిఘా పెడతాయి. ఆకాశంలో..డ్రోన్‌ ఆచూకీ కనిపించినా వెంటనే హెచ్చరిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చివేయగలిగే ఏర్పాటు ఉంటుంది.

యెమెన్ తిరుగుబాటుదారులు సౌదీలోని భారీ చమురు కేంద్రాలపై పది డ్రోన్లతో దాడుల చేశాయి. 2019 సెప్టెంబర్ లో జరిగిన ఈ దాడితో భారీ నష్టం వాటిల్లింది. దీంతో యాంటీ డ్రోన్ వ్యవస్థలు వాడుతున్నాయి. తాజాగా..జమ్ములో డ్రోన్ల దాడి నేపథ్యంలో..ఇజ్రాయెల్ తయారీ స్మాష్ 2000 ప్లస్ యాంటీ డ్రోన్ పరికరాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.

స్మాష్ 2000 ప్లస్ అంటే…
AK – 47 వంటి తుపాకులకు అమర్చుతారు. పగలు, రాత్రి ఎప్పుడైనా సరే ఆయా ప్రాంతాల్లో ఆకాశాన్ని జల్లెడ పడుతూ.. డ్రోన్లను గుర్తించి, అప్రమత్తం చేస్తాయి. వాటికి నేరుగా గురిపెట్టి, కచ్చితంగా నేల కూల్చేందుకు తోడ్పడుతాయి. వీటిని ఆటోమేటిగ్గా ఉపయోగించవచ్చు. లేదా సైనికులు ఆపరేట్‌ చేసేలా మార్చుకోవచ్చు. ఆటోమేటిక్‌ మోడ్‌ను వినియోగించినప్పుడు.. తుపాకీని డ్రోన్‌ వైపు గురిపెడితే.. లక్ష్యానికి సూటిగా రాగానే దానంతట అదే బుల్లెట్స్‌ను ఫైర్‌ చేస్తుంది. నావికా దళం ఇప్పటికే స్మాష్‌ యాంటీ డ్రోన్‌ వ్యవస్థలకు ఆర్డర్‌ ఇచ్చింది. మధ్యతరహా, భారీ డ్రోన్లలో చాలా వరకు విమానాల తరహాలో ప్రయాణించే ‘యూఏవీ’లు ఉంటాయి. చిన్నతరహా డ్రోన్లలో రెండు రకాలూ ఉంటాయి.