Smoke Weed Every Day : ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’.. ట్రాఫిక్‌ సైన్‌ బోర్డులో మెసేజ్‌ డిస్ ప్లే

మహారాష్ట్రలోని ముంబైలో ఒక చోట ట్రాఫిక్ సందేశాలు చూపే ఎల్ఈడీ సైన్ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి పీల్చండి’ అని కనిపించింది. సోమవారం రాత్రి వర్లీ నాకా జంక్షన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎల్ ఈడీ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’ అని డిస్ ప్లే అయింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు అది చూసి ఆశ్చర్యపోయారు.

Smoke Weed Every Day : ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’.. ట్రాఫిక్‌ సైన్‌ బోర్డులో మెసేజ్‌ డిస్ ప్లే

smoke weed every day (1)

Smoke Weed Every Day : మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు.. అతి వేగం ప్రమాదకరం.. వంటి సైన్ బోర్డులు సాధరణంగా రోడ్లపై ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని ముంబైలో ఒక చోట ట్రాఫిక్ సందేశాలు చూపే ఎల్ఈడీ సైన్ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి పీల్చండి’ అని కనిపించింది. సోమవారం రాత్రి వర్లీ నాకా జంక్షన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎల్ ఈడీ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’ అని డిస్ ప్లే అయింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు అది చూసి ఆశ్చర్యపోయారు.

అంధుల కోసం : రైల్వే స్టేషన్‌లో బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డులు

అయితే సాంకేతిక సమస్య వల్ల ఆ మెసేజ్ డిస్ ప్లే అయిందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రవీణ్ పద్వాల్ పేర్కొన్నారు. ఆ ఎల్ ఈడీ సైన్ బోర్డును ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ డిస్ ప్లే బోర్డును ఆపేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఒక వాహనంపై ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది.