BSF : జవాన్లపై దాడి చేసిన స్మగ్లర్లు.. కాల్పుల్లో ఒకరు మృతి

భారత్ - బంగ్లా దారిహద్దుల్లో స్మగ్లర్లు రేర్చిపోయారు. నిషేదిత పదార్దాలను భారత్‌లోకి తరలిస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుంది. బలగాలను చుట్టుముట్టి దాడికి యత్నించించారు.

BSF : జవాన్లపై దాడి చేసిన స్మగ్లర్లు.. కాల్పుల్లో ఒకరు మృతి

Bsf

BSF : భారత్ – బంగ్లా దారిహద్దుల్లో స్మగ్లర్లు రేర్చిపోయారు. నిషేదిత పదార్దాలను భారత్‌లోకి తీసుకొస్తున్న సమయంలో బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుంది. దీంతో స్మగ్లర్లు బీఎస్ఎఫ్ బలగాలను చుట్టుముట్టి దాడికి యత్నించించారు. వీరి దాడిలో ఓ జవాన్‌కి గాయాలయ్యాయి. దుండగులను చెదరగొట్టెదనుకు బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. బలగాల కాల్పులతో పారిపోయారు స్మగ్లర్లు, కాల్పుల్లో ఓ వ్యక్తికి బులెట్ తగలడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

చదవండి : BSF Recruitment 2021: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం.. రూ.69వేల జీతం

చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్మగ్లర్ల నుంచి నిషేదిత పదార్దాలను భారత స్మగ్లర్లు తీసుకుంటున్న సమయంలో తాము అడ్డుకున్నట్లుగా బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. స్మగ్లర్లు తమను చుట్టూ ముట్టి దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. తమ కాల్పుల్లో ఒకరికి గాయాలు కాగా, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.

చదవండి : BSF అధికార పరిధి పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం