పోలీస్ స్టేషన్‌లో పాము…నాగ స్వరాన్ని ఊదిన పోలీసులు

  • Edited By: veegamteam , November 6, 2019 / 05:04 AM IST
పోలీస్ స్టేషన్‌లో పాము…నాగ స్వరాన్ని ఊదిన పోలీసులు

మనింట్లోకి పాము వచ్చిందనుకోండి..ఏం చేస్తాం..వెంటనే పాములు పట్టేవాళ్లను పిలుస్తాం లేదా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజ్నోర్‌లోని హమ్పూర్ దీపా పోలీస్ స్టేషన్‌లోకి ఓ పాము వచ్చింది. పాపం పోలీసులైనా వాళ్లు కూడా మనుషులే కదా..బాబోయ్..వీళ్లు పోలీసులు వీళ్లని కరిస్తే అరెస్ట్ చేస్తారని పామేమన్నా భయపడుతుందా ఏమిటి? అందుకే ఆ పాముని చూపి పోలీసులు హడలిపోయారు. ఆ పాము బారిన పడకుండా బైటకు రావటానికి చాలా కష్టపడ్డారు. ఎలాగోలా బైటకు వచ్చారు. కానీ లోపల ఉన్న పాముని పట్టించాలి..లేదంటే లోపలికి వెళ్లటానికి లేదు. 

అందుకని పాములు పట్టేవారిని పిలింపించారు. వారు పాముని పట్టుకునేందుకు నానా అవస్థలు పడ్డారు.దీంతో పోలీసులు నాగస్వరానికి పాములు తలలు ఊపి ఆడతాయని గుర్తుకొచ్చింది. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్స్ బహుశా వారికి గుర్తుకొచ్చి ఉంటాయి. దీంతో పాములు పట్టేవారి దగ్గర ఉన్న నాగ స్వరాన్ని తీసుకుని వాయించారు. నాగస్వరాన్ని ఊదుతూ పామును పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు.  ఆ పాము ఎంతకూ బయటకు రాలేదు. కానీ చాలాసేపు ప్రయత్నించిన అనంతరం అతికష్టం మీద ఆ పామును ఎలాగోలా పట్టుకోగలిగారు. దీంతో పోలీసులు హమ్మయ్యా..అంటూ ఊపిరి పీల్చుకుని వారి పనుల్లో పడ్డారు. మంగళవారం (నవంబర్ 5)న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.