Dead Snake in Parotta: పరోఠాలో పాము చర్మం: కేరళలో హోటల్ సీజ్ చేసిన అధికారులు

ఎంతో ఆతృతగా పరోటా తిందామని హోటల్‌కు వచ్చిన కస్టమర్..తాను తీసుకున్న పార్సెల్‌లో చచ్చిన పాము చర్మం కనిపించడంపై దెబ్బకు కంగుతినింది.

Dead Snake in Parotta: పరోఠాలో పాము చర్మం: కేరళలో హోటల్ సీజ్ చేసిన అధికారులు

Shalimar

Dead Snake in Parotta: ఎంతో ఆతృతగా పరోటా తిందామని హోటల్‌కు వచ్చిన కస్టమర్..తాను తీసుకున్న పార్సెల్‌లో చచ్చిన పాము చర్మం కనిపించడంపై దెబ్బకు కంగుతినింది. ఈఘటన కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మే 6న చోటుచేసుకోగా..సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..తిరువనంతపురంకు చెందిన ఒక మహిళ పరోటా తినేందుకు తన కూతురుని తీసుకుని సమీపంలోని షాలిమార్ హోటల్‌కు వెళ్ళింది. పరోటా పార్సెల్ తీసుకున్న ఆ మహిళ..అందులో పాము చర్మం కనిపించడంతో ఆందోళనకు గురైంది. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి..ఫుడ్ సేఫ్టీ అధికారులను తీసుకురావాలని చెప్పింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతో సహా షాలిమార్ హోటల్‌కు చేరుకున్న పోలీసులు..మహిళ తీసుకున్న పార్సెల్‌ను పరిసలించి..అందులో నిజంగానే చచ్చిన పాము చర్మం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం హోటల్‌లోని వంటగదిని పరిశీలించిన అధికారులు..అక్కడున్న అపరిశుభ్ర వాతావరణం చూసి అవాక్కయ్యారు.

Also read:Electric bike: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తప్పిన ప్రమాదం..

హోటల్ వంట గదిలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పాత్రలు కడిగిన సందర్భం లేదని..కనీసం కిచెన్లో సరిపడా వెలుతురూ కూడా లేకపోవడం అధికారులు గుర్తించారు. మరికొన్ని ఆహార పదార్ధాలను కూడా గమనించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..వాటిలోనూ ఏమాత్రం నాణ్యత లేదని గుర్తించారు. దీంతో హోటల్ షాలిమార్‌ను అప్పటికప్పుడు సీజ్ చేశారు అధికారులు. ఇక విషయాన్ని తుషార్ కాంత్ అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేసుకోగా.. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇకపై హోటల్‌లో ఆహారాన్ని ముట్టనేముట్టను అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేయగా..ఇలాంటి హోటల్స్ వలన మిగతా హోటల్స్‌కు చెడ్డ పేరు వస్తుందని కామెంట్ చేశారు.