Snakebite: పాముకాటుతో సోదరుడి మృతి.. అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడినీ కాటేసిన పాము

పాముకాటుతో మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిని మరో పాము కాటేసింది. ఈ విషాదకరమైన ఘటన యూపీలోని భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అంత్యక్రియల కోసం వచ్చిన గోవింద్ మిశ్రా కూడా పాము కాటుతో మృతి చెందినట్లు..

Snakebite: పాముకాటుతో సోదరుడి మృతి.. అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడినీ కాటేసిన పాము

 

 

Snakebite: పాముకాటుతో మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిని మరో పాము కాటేసింది. ఈ విషాదకరమైన ఘటన యూపీలోని భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అంత్యక్రియల కోసం వచ్చిన గోవింద్ మిశ్రా కూడా పాము కాటుతో మృతి చెందినట్లు సర్కిల్ ఆఫీసర్ రాధా రమణ్ సింగ్ తెలిపారు.

నిద్రిస్తున్న సమయంలో గోవింద్ మిశ్రాను పాము కాటేసింది. అంత్యక్రియల కోసం అరవింద్ మిశ్రాతో కలిసి అతని బంధువైన చంద్రశేఖర్ పాండే… గోవింద్ మిశ్రా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పాము కాటు వేయడంతో అరవింద్ మిశ్రా అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రశేఖర్‌ను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.

పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సీనియర్ మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. లోకల్ ఎమ్మెల్యే కైలాశ్ నాథ్ శుక్లా మృతుడి కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేశారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Read Also: రైలు కంపార్టుమెంట్‌లో పాము.. హడలెత్తిన ప్రయాణికులు