Snakebite Death : పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం

పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుకు గురై చనిపోవటం కూడా రాష్ట్ర విపత్తుకిందే ప్రకటించింది.

Snakebite Death : పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం

Snakebite Death A State Calamity 4 Lakh Compensation

snakebite death a state calamity 4 lakh compensation : పాము కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 1,38,000 మంది బలవుతున్నారనీ..ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలా పాముకాటుకు గురై చనిపోయేవారు భారత్ లో వేలాదిమంది ఉన్నారు. ఈ క్రమంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతే..అది దురదృష్టమనీ..సర్పదోషమని సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇకనుంచి పాముకాటు కూడా రాష్ట్ర విపత్తు అని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుతో ప్రాణాలు కోల్పోతే పరిహారం కూడా ఇస్తామని ప్రకటించింది యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం.పాముకాటుతో చనిపోతే… ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారంగా ఇస్తుందని తెలిపింది.

యూపీలో పాముకాటుకు గురై చనిపోయేవారు సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భూకంపం, సునామీ, తుఫాన్ల వలెనే పాముకాట్లను కూడా రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఇకపై ఎవరైనా పాముకాటుతో చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారంగా ఇస్తుందని తెలిపింది. ఈ పరిహారాన్ని అతి తక్కువ రోజుల్లోనే అందజేస్తామని..మరణం సంభవించిన కేవలం 7 రోజుల్లోనే పరిహారం ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లను అదనపు సీఎస్ మనోజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంచి నిర్ణయం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే రాత్రిళ్లు పొలం దగ్గర వాటర్ మోటర్ ఆన్ చెయ్యాలని వెళ్లి… పాముకాట్లకు బలైపోతున్నారు చాలామంది రైతులు. దీంతో రైతులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇదివరకు పాముకాటు మరణాన్ని నిర్ధారించడం గతంలో పెద్ద తలనొప్పిలా ఉండేది. ఈ ప్రక్రియలో ఎన్నో లోపాలుండేవి. ఎందుకంటే స్థానికంగా ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్ సరిగా పనిచేసేది కాదు. పాము ఎక్కడో కాటువేస్తేవారిని తీసుకుని ఎక్కడెక్కడికో తిరగాల్సి వచ్చేది. అయినా అయ్యేవి కాదు. దాంతో ఇంకెక్కడో రకరకాల టెస్టులు చేయించటంతో రిపోర్టులు కూడా సరిగా వచ్చేవి కాదు. దీంతో రిపోర్టుల్లో గందరగోళం ఉండేది. దీంతో రైతులు విసిగిపోయారు. పాముకాటుతో చనిపోయినా దాన్ని నిర్దారించే ప్రక్రియ తలనొప్పిగా ఉండటంతో ఆ దిశగా యత్నించటం మానేశారు. పాముకాటుతో చనిపోయినా..రిపోర్టుల్లో గందరగోళం వల్ల అది లెక్కల్లో నమోదు అయ్యేది కాదు. ఈక్రమంలో ప్రభుత్వం… అసలీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టే అవసరం లేదని చెప్పింది.

ఎప్పట్లాగే పోస్ట్‌మార్టం జరుపుతారు. కానీ విసెరా రిపోర్ట్ అవసరం లేదు. జిల్లా అధికారులే పాముకాటుతో చనిపోయిందీ లేనిదీ డిసైడ్ చేస్తారని స్పష్టంచేస్తారు.అలా పాముకాటుతో చనిపోయినట్లుగా నిర్ధారణ అయితే వారం రోజులకే పరిహారం నగదును ఇస్తారని తెలిపారు. పాముకాటుతో చనిపోయినవారికి పరిహారం అందించే బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్ చూసుకోవాలి.

కాగా..యూపీలో వర్షాకాలంలో పాముకాట్లు లఖింపూర్ ఖేరి, పిలిభిత్, గోరఖ్‌పూర్, డియోరియా వంటి జిల్లాలు హాట్‌బెడ్‌గా మారాయి.ఇటీవల..సహారాన్‌పూర్‌లో నాలుగేళ్ల బాలుడు మంచం మీద నిద్రపోతుండగా..తెల్లవారుజామున 4 గంటల సమయంలో పాము కాటుకు గురై మరణించాడు. బాలుడి ముఖం మీద కాటు వేయటంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.