So-called aam aadmi: పంజాబ్ సీఎం కాన్వాయ్‌లో 42 కార్లు.. ఆమ్ ఆద్మీపై కాంగ్రెస్ విమర్శలు

పంజాబ్ సీఎం భగవంత్ మన్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వీఐపీ కల్చర్‌ను అంతం చేస్తామని ప్రకటించిన ఆప్, ఆ పార్టీ సీఎం.. ఇప్పుడు ఏకంగా 42 వాహనాలను కాన్వాయ్ కోసం వాడటమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.

So-called aam aadmi: పంజాబ్ సీఎం కాన్వాయ్‌లో 42 కార్లు.. ఆమ్ ఆద్మీపై కాంగ్రెస్ విమర్శలు

So-called aam aadmi: ‘సామాన్యుడి పార్టీ’గా చెప్పుకొనే ‘ఆమ్ ఆద్మీ’ పార్టీపై పంజాబ్ కాంగ్రెస్ విమర్శలు చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ కాన్వాయ్‌లో 42 కార్లు వినియోగించడంపై విమర్శలు గుప్పించింది. ఇదేనా సామాన్యుడి పార్టీ అంటే అని ప్రశ్నించింది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

పంజాబ్‌లో వీఐపీ కల్చర్‌ను అంతం చేస్తామని గతంలో ఆప్ ప్రభుత్వం పలువురికి సెక్యూరిటీని తొలగించిన సంగతి తెలిసిందే. తర్వాత సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తిరిగి మార్చుకుంది. అయితే, రాష్ట్రంలో వీఐపీ కల్చర్‌కు దూరంగా ఉంటామని చెప్పిన సీఎం భగవంత్ మన్.. ఇప్పుడు ఏకంగా తన కాన్వాయ్ కోసం 42 కార్లను వినియోగించడం ఏంటని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా ప్రశ్నించారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల్ని ఆయన తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘2007-2017 వరకు.. అంటే పదేళ్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ తన కాన్వాయ్ కోసం 33 వాహనాలనే వినియోగించారు.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బాదల్ కూడా 33 కార్లను వినియగించారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన చన్నీ ఆరు కార్లను ఎక్కువగా అంటే.. 39 కార్లను వినియోగించాడు. అయితే సామాన్యుడి పార్టీగా చెప్పుకొనే ‘ఆమ్ ఆద్మీ’ తరఫున ముఖ్యమంత్రి అయిన భగవంత్ మన్ మాత్రం ఏకంగా 42 కార్లను కాన్వాయ్ కోసం వినియోగిస్తున్నాడు. గతంలో భగవంత్ మన్ ఇదే అంశంపై ముఖ్యమంత్రుల్ని ప్రశ్నించాడు. మీరు రాజులా? లేక మహారాజులా? అన్నాడు. ఇప్పుడు ఆయనే 42 వాహనాలు వినియోగిస్తున్నందున ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలి’’ అని ప్రతాప్ సింగ్ బాజ్వా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.