Anna Hazare: కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలపై అన్నాహజారే ఆగ్రహం

సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలను అనుమతించడం దురదృష్టకరం

Anna Hazare: సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలను అనుమతించడం దురదృష్టకరమని సామాజిక కార్యకర్త అన్నా హజారే అభిప్రాయపడ్డారు.

మద్యం నుంచి డీ-అడిక్షన్ దిశగా కృషి చేయడం ప్రభుత్వ కర్తవ్యమని, కానీ.. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. ఫలితంగా ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారని అన్నారు.

కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో మద్యం అమ్మకాలను అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతించింది.

రాష్ట్రంలో మద్యం తయారుచేసే అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయని, మద్యం ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు