ఆదివారం సూర్యగ్రహణం.. గ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు

  • Published By: murthy ,Published On : June 20, 2020 / 08:13 AM IST
ఆదివారం సూర్యగ్రహణం.. గ్రహణం రోజున పాటించాల్సిన నియమాలు

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం రేపు(ఆదివారం, జూన్ 21) ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. వలయాకారంలో కనువిందు చేయనుంది. దీన్ని చూడామణి నామక సూర్యగ్రహణంగా జ్యోతిష్య పండితులు పిలుస్తున్నారు. తేదీ. 21-06-2020 ఉదయం 11:58 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4, ఆరుద్ర-1 పాదాలు మిథున రాశిలో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చి చంద్రుడి నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజులలోనే జరుగుతుంది.

ఈ గ్రహణాన్ని భారత్, ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా ప్రాంతాల్లో వీక్షించొచ్చు. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించనుంది. మన దేశంలో డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లో సంపూర్ణంగా కనిపించనుంది.
 
తెలంగాణ రాష్ట్రానికి 
గ్రహణ ఆరంభకాలం : ఉ. 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ. 11.55 
గ్రహణ అంత్యకాలం : మ. 1.44 
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు

ఆంధ్ర రాష్ట్రానికి 
గ్రహణ ఆరంభకాలం : ఉ. 10.23 
గ్రహణ మధ్యకాలం : మ. 12.05
గ్రహణ అంత్యకాలం : మ. 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలుగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

గ్రహణ నియమాలు
* గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం ఉదయం 6 గంటల వరకు అందరూ అన్నపానాదులు ముగించాలి. 
* వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తినొచ్చు
* ఆచార సాంప్రదాయాలను అనుసరించి మిగిలిన గ్రహణ నియమాలు పాటించాలని పండితులు సూచించారు. 
* సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దు
* దీని వల్ల శాశ్వతంగా అంధత్వం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
* మృగశిర, ఆరుద్ర, నక్షత్రముల వారు, మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. 

Read: Delhiకి భారీ భూకంప ముప్పు..శాస్త్రవేత్తలు హెచ్చరిక