సూర్యగ్రహణం : కురుక్షేత్రలో నిబంధనలు..holy dip bannned

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 09:11 AM IST
సూర్యగ్రహణం : కురుక్షేత్రలో నిబంధనలు..holy dip bannned

ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం 2020, జూన్ 21న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాగా, వలయాకారంలో ఏర్పడనుంది. జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై..సాయంత్రం 3 గంటల 04 నిమిషాలకు ముగియనుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు..ఈ మూడు ఒకే సరళ రేఖపైకి వచ్చి..చంద్రుడి నీడ..సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఈ గ్రహణాన్ని నేరుగా చూడొద్దని..కంటి చూపు పోయే ప్రమాదం ఉందంటున్నారు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ లో గ్రహణం కనిపించనుంది. డెహ్రడూన్, కురుక్షేత్ర, చమోలి, జోషిమత్, సిర్సా, సూరత్ తదితర ప్రదేశాల్లో సూర్యగ్రహణం కనిపించనుందని చెబుతున్నారు. పూర్తి సూర్యగ్రహణం ఉదయం 10.12 గంటలకు ప్రారంభ కానుందని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముగుస్తుందని మరికొందరు వెల్లడిస్తున్నారు. 

కానీ ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యగ్రహణం రావడం గమనార్హం. ఈ సందర్భంగా అధికారులు పలు నిబంధనలు విధించారు. గ్రహణం కనిపించే ప్రదేశాల్లో ఒకటైన కురుక్షేత్ర వద్ద 2020, జూన్ 19వ తేదీ శుక్రవారం నిషేధ ఉత్తర్వులు విధించాలని నిర్ణయించారు.

నలుగురికన్నా ఎక్కువ మంది ఉండవద్దని సూచించారు. సూర్య గ్రహణం సమయంలో..బ్రహ్మ సరోవర్, సన్నిహిత్ సరోవర్ వద్ద ఎవరూ మునగకుండా..ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ ధీరేంద్ర వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐపీసీ సెక్షన్ 188 కింద జరిమాన విధిస్తామని హెచ్చరించారు. కురుక్షేత్ర ప్రాంతానికి వెళ్లే దారులపై చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 

Read: చైనా కంపెనీలతో లింకులు తెంచేసుకున్న BCCI, IOA