నేరుగా చూడొద్దు : ప్రారంభమైన సూర్యగ్రహణం

సూర్యగ్రహణం ప్రారంభమైంది. గురువారం(డిసెంబర్ 26, 2019) ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది.

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 03:10 AM IST
నేరుగా చూడొద్దు : ప్రారంభమైన సూర్యగ్రహణం

సూర్యగ్రహణం ప్రారంభమైంది. గురువారం(డిసెంబర్ 26, 2019) ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది.

సూర్యగ్రహణం ప్రారంభమైంది. గురువారం(డిసెంబర్ 26, 2019) ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది. ఉ.10.47 గంటలకు గ్రహణం ముగుస్తుంది. కాగా, భారత్ లో గ్రహణ ప్రభావం పాక్షికమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఫిలిప్సిన్స్, సింగపూర్ లో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం చోటు చేసుకోనుందని తెలిపారు. గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు హెచ్చరించారు. అలా నేరుగా చూస్తే కంటి చూపుకి ప్రమాదం అన్నారు. సోలార్ ఫిల్టర్లతోనే గ్రహణాన్ని చూడాలని నిపుణులు సూచించారు.

* ఉ.7.59 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం
* 9.04 గంటలకు గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుతుంది
* ఉ.10.47 గంటలకు ముగియనున్న సూర్యగ్రహణం
* సూర్యగ్రహణం గరిష్టంగా 3 నిమిషాల 40 సెకన్లు ఉంటుంది
* భారత దేశంలో గ్రహణ ప్రభావం పాక్షికమే
* భారత్, ఆస్ట్రేలియా, ఫిలిప్పిన్స్, సౌదీ అరేబియా, సింగపూర్ లో కనిపించనున్న సూర్యగ్రహణం
* కోజికోడ్, కోయంబత్తూర్, జాఫ్నా, ట్రింకోమలి, సింబోలా, బాటం, సింగపూర్, సింగ్కావాంగ్ లో సంపూర్ణ సూర్యగ్రహణం
* కేరళలోని చెరువతూర్ లో సంపూర్ణ గ్రహణం
* రింగ్ ఆఫ్ ఫైర్ గా సూర్యగ్రహణం
* చందమామ చుట్టూ కనిపించనున్న సూర్యజ్వాలలు
* హైదారబాద్ లో ముప్పావు వంతు కనిపించనున్న రింగ్ ఆఫ్ ఫైర్
* గ్రహణాన్ని సోలార్ ఫిల్టర్లతోనే చూడాలని సూచన
* 2019లో ఇది 5వ సూర్యగ్రహణం

సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఇవాళ(2019 డిసెంబరు 26) ఏర్పడింది. ఈ కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవిస్తుంది. మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.

ఈ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు ఇప్పటికే సూచించారు. 99శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకన్ల పాటు చూసినా ప్రమాదమే అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సూర్యగ్రహణం చాలా ప్రమాదం అని చెప్పారు.

Also Read : ఈ స్తోత్రం చదువుకుంటే గ్రహణ దోషం ఉండదు

Also Read : ఈ రాశుల వారిపై గ్రహణ ప్రభావం ఉండదు