Top Air Force Officer : POK భారత్ లో కలవడం ఖాయం..సంపూర్ణ కశ్మీర్ మనదే

ఏదో ఒక రోజు భారత్ కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్‌ను సాధించి తీరుతుందని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. స్వతంత్ర భారత మొదటి సైనిక సంఘటనను గుర్తుచేసుకుంటూ

Top Air Force Officer : POK భారత్ లో కలవడం ఖాయం..సంపూర్ణ కశ్మీర్ మనదే

Kashmir (1)

Top Air Force Officer  ఏదో ఒక రోజు భారత్ కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్‌ను సాధించి తీరుతుందని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. స్వతంత్ర భారత మొదటి సైనిక సంఘటన “బుడ్గామ్ ల్యాండింగ్”ను గుర్తుచేసుకుంటూ బుధవారం దేశవ్యాప్తంగా 75వ పదాతిదళ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కశ్మీర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ మాట్లాడుతూ…పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలను పాకిస్తానీలు సరిగా చూసుకోవడం లేదన్నారు. ఏదో ఒక రోజు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) జమ్ముకశ్మీర్‌లో ఖచ్చితంగా కలుస్తుందన్నారు. 1947లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకపోతే కశ్మీర్ మొత్తం మనదే అయి ఉండేదని ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ అన్నారు.

కాగా, సంపూర్ణ కశ్మీర్ కోసం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడేమైనా ప్లాన్స్ ఉన్నాయా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు..ఇప్పటికైతే అలాంటి ప్రణాళికలేవీ లేవని సమాధానమిచ్చారు. కశ్మీర్ అంతా ఒకటి. దేశం ఒకటి. ఇరువైపులా ఉన్న ప్రజల్లో ఒకే అటాచ్‌మెంట్ ఉన్నది. ఇవాళ లేదా రేపు.. చరిత్రలోనూ ఎన్నో దేశాలు కలిసిపోయిన ఉదంతాలున్నాయి. ప్రస్తుతానికైతే సంపూర్ణ కశ్మీర్ కోసం తమ దగ్గర ప్రణాళికలేవీ లేవని వివరించిన ఆయన.. అది దైవేచ్ఛ అని తెలిపారు.

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు తగినట్టుగా వైమానిక దళమూ అప్‌డేట్ కావాలని అమిత్ దేవ్ అన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి అదే రీతిలో బలమైన మిలిటరీ అవసరమన్నారు. భవిష్యత్‌లో వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని, తమపై ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.

భారత బలగాలు బుడ్గాంలో అడుగుపెట్టి 75ఏళ్లు నిండిన నేపథ్యంలో దాని గురించి అమిత్ దేవ్ మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ ట్రైబల్ దాడుల నేపథ్యంలో అప్పటి సంస్థానాధీశుడు మహారాజ హరిసింగ్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం తర్వాత 1947లో అక్టోబర్ 27న భారత బలగాలు కశ్మీర్‌లో అడుగుపెట్టాయి. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఆ పోరాటం అర్ధంతరంగా ముగిసింది.

ఇన్‌స్ట్రూమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం చేసిన తర్వాత, మేము మా దళాలను త్వరగా తరలించాము. శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్‌ను రక్షించాము. ఆ తర్వాత మేము మరింత దాడి చేసి ఉండేవాళ్లం. కబలీస్‌ వరకు వచ్చిన పాకిస్థాన్‌ మిలిటరీని మరింత వెనక్కి నెట్టి ఉండేవాళ్లం. ఐరాస జోక్యం చేసుకోకుంటే, కశ్మీర్ మొత్తం మనదే అయి ఉండేది. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు అని అమిత్ దేవ్ అన్నారు. బుడ్గామ్‌లో ఐఏఎఫ్‌, సైన్యం పాల్గొనడం మాత్రమే కాదు, పీవోకే స్వేచ్ఛ కోసం అనేక చిన్న మిషన్లు కూడా జరిగాయని అమిత్‌ దేవ్‌ తెలిపారు.

ALSO READ Mansukh Mandaviya : ఆసియాలో తొలిసారి..భారత్ లో కంటైనర్ హాస్పిటల్స్