Punjab Congress: పంజాబ్ పీసీసీ పగ్గాలు సిద్ధూకే.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన

ఎట్టకేలకు గత సంప్రదాయలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందో గమినించి, చర్చించి ఆయా రాష్ట్రాల్లో పూర్తి బాధ్యతలను వారికే అప్పగిస్తోన్న కాంగ్రెస్.. లేటెస్ట్‌గా రాష్ట్ర కాంగ్రెస్ ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా పంజాబ్ పగ్గాలు సిద్ధూకే అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

Punjab Congress: పంజాబ్ పీసీసీ పగ్గాలు సిద్ధూకే.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన

Punjab

Punjab Congress Chief: ఎట్టకేలకు గత సంప్రదాయలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందో గమినించి, చర్చించి ఆయా రాష్ట్రాల్లో పూర్తి బాధ్యతలను వారికే అప్పగిస్తోన్న కాంగ్రెస్.. లేటెస్ట్‌గా రాష్ట్ర కాంగ్రెస్ ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా పంజాబ్ పగ్గాలు సిద్ధూకే అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.

పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌, న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మ‌ధ్య రాజీకి ప్రయత్నించినా ఫలించలేదు. కానీ, సిద్ధూ వైపే మొగ్గుచూపింది కాంగ్రెస్. ఇక పంజాబ్ సీఎంగా అమ‌రీంద‌ర్ కొన‌సాగనుండగా.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు కానున్నారు.

కొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉండగా.. ఇద్ద‌రు సీనియ‌ర్ లీడ‌ర్ల మ‌ధ్య విభేదాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆందోళ‌న‌కు గురిచేశాయి. దీనికి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ, సిద్దూని రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఆదివారం విడుదలైంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూను నియమిస్తూ అధిష్ఠానం అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

పంజాబ్ కాంగ్రెస్‌లో సీఎం అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలు ఎన్నోరోజులుగా వివాదాలు చోటు చేసుకున్న క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యోచించింది. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు రాహుల్ గాంధీ అండదండలుండగా, నవజోత్ సింగ్ సిద్ధుకు మద్దతుగా ప్రియాంక గాంధీ ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్‌ని కూడా రంగంలోకి దింపినట్లుగా వార్తలు వచ్చాయి.

రాష్ట్రంలో మరో నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది కాంగ్రెస్. సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, ఖుల్జీత్ సింగ్ నగ్రాలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దూను అడ్డుకునేందుకు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆయన వర్గీయులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు.