Sonia Gandhi : కరోనాపై పోరుకు కేంద్రం సంసిద్దంగా లేదు..25ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

విడ్​ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది.

Sonia Gandhi : కరోనాపై పోరుకు కేంద్రం సంసిద్దంగా లేదు..25ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

Sonia Gandhi Demands To Reduce Covid 19 Immunization Age Limit To 25 Years

Sonia Gandhi కొవిడ్​ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. వైరస్​ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించారు పార్టీ నేతలు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

కరోనా సెకండ్ వైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష వైఖరితో ఉందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. వైరస్​ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధంగా లేదని విమర్శించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (CWC) సమావేశమైంది. సోనియా గాంధీ నాయకత్వంలో జరిగిన సమావేశానికి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్​ గాంధీ సహా పార్టీ ఉన్నత స్థాయి జనరల్​ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్​ఛార్జ్​లతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు,పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్ధిక వ్య‌వ‌స్ద‌పై క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పైనా,వైరస్​ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై పార్టీ నేతలు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చర్చించారు.

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని సోనియాగాంధీ ఆరోపించారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా.. ప్రతిపక్షాలు ఇంకా పర్యవేక్షించాల్సి రావటం విచారకరమని సోనియా అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల‌తో పాటు త‌మ పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వాల్లో భాగ‌స్వామిగా ఉన్న రాష్ట్రాల ప్ర‌తినిధుల‌తోనూ విస్ప‌ష్టంగా చ‌ర్చించాన‌ని, కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డంలో మోడీ స‌ర్కార్ స‌మ‌ర్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంద‌ని సోనియా గాంధీ పేర్కొన్నారు. త‌మ పార్టీ సీఎంల‌తో స‌మావేశం అనంత‌రం తాను ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని, సీఎంలు సైతం ప్ర‌ధానితో మాట్లాడార‌ని కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వ‌లు అడుగంట‌గా ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్ల కొర‌త తీవ్రంగా ఉంద‌ని ఆమె చెప్పారు.

కరోనాపై పోరాటం జాతీయ సమస్య అని సోనియా అన్నారు. అన్ని పార్టీలు దీనిపై కలిసి పోరాడాలన్నారు. గత ఏడాదిగా తాము ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చామని… ప్రతిపక్షాల సలహాలను వినకుండా.. కేంద్రం విమర్శలను గుప్పిస్తోందని సోనియా అన్నారు. వైర‌స్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో 25ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ కు అనుమ‌తించాల‌ని సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి అవసరమైన వైద్య సామగ్రిని జీఎస్టీ నుంచి తొలగించాలన్నారు.