ఏప్రిల్-11న PCC చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 11:06 AM IST
ఏప్రిల్-11న PCC చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏప్రిల్-11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించిన రిలీఫ్ వర్క్ గురించి పీసీసీ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి 5 సూచనలు చేస్తూ సోనియాగాంధీ మంగళవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

టీవీ,ప్రింట్ మీడియాల్లో ప్రభుత్వ ప్రకటనలు బ్యాన్ చేయడం, 20వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం,ప్రెసిడెంట్,మంత్రుల అధికారిక విదేశీ టూర్లను నలిపివేయడం వంటివి సోనియా సూచించిన వాటిలో ఉన్నాయి. పార్లమెంట్ ఎంపీలకు వాళ్ల జీతాల్లో 30శాతం కోత విధిస్తూ ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ మద్దతిస్తుందని మోడీకి రాసిన లేఖలో సోనియాగాంధీ తెలిపారు.