తీహార్ జైలుకు సోనియా గాంధీ

  • Published By: vamsi ,Published On : September 23, 2019 / 06:19 AM IST
తీహార్ జైలుకు సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కలుసుకుని పరామర్శించారు. చిదంబరంకు పార్టీ అండగా ఉందని చెప్పాలనే వాళ్లు జైలుకు వెళ్లి కలిసినట్లు పార్టీ వెల్లడించింది.

ఐఎన్‌క్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ అరెస్టు చేసి తీహార్ జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిదంబరం తీహార్ జైలులోనే ఉంటున్నారు. మూడు వారాల నుంచి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా కోర్టులు మాత్రం చిదంబరంకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా చిదంబరం ట్విట్టర్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది. తన పేరుమీదుగా ఈ ట్వీట్ చేయమని తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు చిదంబరం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు బంగారు రెక్కలు వచ్చి చందమామ మీదకు ఎగిరిపోతారని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని అయితే తాను సేఫ్‌గా ల్యాండ్ అవుతానని అన్నారు.

అలాగే తనను కలిసేందుకు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటుందని, నేను కూడా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉన్నానని చెప్పారు. ఇదిలా ఉంటే ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఎఫ్ఐపీబీ క్లియరెన్స్‌ ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడ్డార చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది.