రాయబరేలిలో నామినేషన్ వేసిన సోనియా గాంధీ

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 10:50 AM IST
రాయబరేలిలో నామినేషన్ వేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 11 గురువారం నామినేషన్ దాఖలు చేసారు. తన కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెంటరాగా ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాయబరేలిలో ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పోటీకి దూరంగా ఉన్నారు. 

రాయబరేలి నుంచి వరుసగా నాలుగు సార్లు సోనియా గాంధీ గెలిచారు. ఐదోసారి కూడా ఆమె బరిలోకి దిగుతుడటంతో కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా యూపీ పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. సోనియాగాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి దినేష్ సింగ్‌ బరిలో ఉన్నారు. ఇటీవలే దినేష్ సింగ్‌ బీజేపీలో చేరారు.  

సోనియాగాంధీ 2004, 2006 లో జరిగిన ఉపఎన్నికలో, 2009, 2014లో రాయబరేలి నుంచి గెలిచారు. 2014లో ఆమె 5 లక్షల 24 వేలపైగా ఓట్లతో విజయం సాధించారు. మే 6న జరిగే ఐదో దశ ఎన్నికల్లో భాగంగా రాయబరేలిలో పోలింగ్ జరుగుతుంది.