సోనియా గాంధీ పుట్టినరోజు.. వేడుకులకు దూరంగా కాంగ్రెస్.. కారణం ఇదే!

  • Published By: vamsi ,Published On : December 8, 2020 / 09:17 AM IST
సోనియా గాంధీ పుట్టినరోజు.. వేడుకులకు దూరంగా కాంగ్రెస్.. కారణం ఇదే!

sonia-gandhi-not-to-celebrate-birthday-over-farmers-agitation-covid-19-pandemic

Sonia Gandhi:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవట్లేదని ప్రకటించారు. డిసెంబర్ 9న ఆమె పుట్టినరోజు సంధర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జరపవద్దని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులు, దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.



చాలా రోజులుగా దేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. ‘భారత్ బంద్’ కూడా నిర్వహిస్తున్నారు. ఈ దేశవ్యాప్త బంద్ ఈరోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. రైతుల బంద్‌కు కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీల మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.



సోనియా గాంధీ అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో. సోనియా గాంధీ 9 డిసెంబర్ 1946లో ఇటలీలో జన్మించారు. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె.. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి తీసుకోమని అడుగగా నిరాకరించారు. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయారు.



2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియన్స్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.