CBSE English Paper Controversy : సోనియా సీరియస్..ఆ ప్రశ్న తొలగించిన సీబీఎస్ఈ

ఇళ్లల్లో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే పిల్లల్లో క్రమశిక్షణ కొరవడుతుందని, భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చేలా

CBSE English Paper Controversy : సోనియా సీరియస్..ఆ ప్రశ్న తొలగించిన సీబీఎస్ఈ

Sonia

Sonia Gandhi : ఇళ్లల్లో మహిళలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్లే పిల్లల్లో క్రమశిక్షణ కొరవడుతుందని, భర్త మార్గాన్ని అనుసరించడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు అనే అర్థం వచ్చేలా డిసెంబర్ 11, 2021న‌ జరిగిన సీబీఎస్ఈ (CBSE) పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నా పత్రంలో ఓ పేరా ఇవ్వడంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం పార్లమెంట్ సాక్షిగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ‘షాకింగ్ రిగ్రెసివ్ పాసేజ్’ అని ఆమె అన్నారు. లింగ నిర్దారణ ఆధారంగా పిల్లలకు పరీక్షా పత్రాల్లో ఈ తరహా ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం అని సోనియా ప్రశ్నించారు.

మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్ఈ ఇంగ్లీష్ పేపర్ లో ప్రశ్న రావడాన్ని సోమవారం లోక్ సభ వేదికగా తీవ్రంగా ఖండించిన సోనియా..ఈ ప్యాసెజ్‌ను తొల‌గించ‌డంతోపాటు ప్రభుత్వం, సీబీఎస్‌ఈ బోర్డు వెంటనే స్త్రీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యాశాఖపై దీనిపై పూర్తిస్థాయి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కాగా, లోక్‌సభలో సోనియాగాంధీ ఈ అంశాన్ని లేవనెత్తిన సమయంలోనే సీబీఎస్‌ఈ దీనిపై వివరణ ఇచ్చింది. టెన్త్‌ క్లాస్‌ సిలబస్‌తో పాటు ప్రశ్నాపత్రం నుంచి ఆ పేరాను ఉప‌స‌హ‌రించుకొని విద్యార్థులంద‌రికీ మార్కులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ పేరాకు అందరికీ ఫుల్‌ మార్కులు ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

అంతకుముందు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో…”ఇప్పటి వరకు సీబీఎస్ఈ పేపర్లన్నీ కఠినంగానే ఉన్నా యి. ఇక ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చిన పాసేజ్ చాలా అసహ్యంగా ఉంది. యువత మనోధైర్యా న్ని , భవిష్య త్తును దెబ్బ తీసే ఇటువంటి చర్య..ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రయత్నా ల్లో భాగమే”అన్నారు.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…”మ‌నం నిజంగా పిల్లలకు ఏం నేర్పుతున్నాము. బీజేపీ ప్రభుత్వం మహిళలపై ఈ తిరోగమన దృక్పథాలను ప్రోత్స‌హిస్తోంద‌ని ఆమె వ్యాఖానించారు. ఇలాంటివి సీబీఎస్‌సీ పాఠ్యాంశాల్లో ఎందుకు క‌నిపిస్తున్నాయి”అని ప్రశ్నించారు.