బలపరీక్షలో గెలుపు మాదే : బీజేపీ ఖేల్ ఖతం అన్న PSU

  • Published By: chvmurthy ,Published On : November 26, 2019 / 05:55 AM IST
బలపరీక్షలో గెలుపు మాదే : బీజేపీ ఖేల్ ఖతం అన్న PSU

మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని  ఆమె అభివర్ణించారు. బలపరీక్షలో మహారాష్ట్ర ప్రగతిశీల కూటమిదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు ఎన్సీపీ సైతం సుప్రీం తీర్పుపై స్పందించింది. బీజేపీ ఖేల్‌ ఖతం అంటూ ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.‘‘సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నాం. రేపు జరిగే బలపరీక్షలో గెలవగల సంఖ్యాబలం మాకు ఉంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మైలు రాయి లాంటిది. రేపు 5 గంటల్లోగా అంతా తేలిపోతుందని మేము భావిస్తున్నాం. ఇక బీజేపీ పని అయిపోయింది….’’ అని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మలిక్ పేర్కొన్నారు.