Sonu Sood: రెండు పార్టీలు రాజ్యసభ సీటును ఆఫర్ చేశాయి.. తిరస్కరించా -సోనుసూద్

రీల్ లైఫ్‌లో విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్.. ఒక్కసారిగా పన్ను ఎగవేత ఆరోపణలో మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్‌గా అయ్యారు.

Sonu Sood: రెండు పార్టీలు రాజ్యసభ సీటును ఆఫర్ చేశాయి.. తిరస్కరించా -సోనుసూద్

Sonu Sood (1)

Sonu Sood: రీల్ లైఫ్‌లో విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్.. ఒక్కసారిగా పన్ను ఎగవేత ఆరోపణలో మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్‌గా అయ్యారు. రాజకీయ పార్టీలు ఈ సోదాలను రాజకీయం అంటున్నాయి. మరికొందరు తమ పార్టీలోకి రావాలని సోనుసూద్‌ను కోరుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఆపన్న హస్తం అందించి ఆదుకున్న సోనుసూద్.. ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించి మెస్సయ్యగా చేరువయ్యారు.

ట్రావెలింగ్ ఏర్పాట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, రోగులకు మందులు, ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడం, వలస కార్మికులకు ట్రైన్లు ఏర్పాటు చెయ్యడం.. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్‌పై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలను సోనూసూదే ఖండించారు. తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని చెబుతూ.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ఇప్పటికే ముందుకు వచ్చాయని చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయాల్లో చేరేందుకు ప్రస్తుతం మానసికంగా సిద్ధంగా లేనని చెప్పిన సోనూసూద్.. వాటిని నిరాకరించినట్లు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సంధర్భంగా రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా వివరాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తనపై జరిగిన ఐటీశాఖ దాడుల గురించి కూడా మాట్లాడిన సోనూ.. సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. మంచి మనస్సుతో దేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలకు.. విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలో ప్రతీ రూపాయి పనిచేస్తుంది.

నాకు వచ్చిన డబ్బు మొత్తం డొనేషన్లు మాత్రమే కాదు.. బ్రాండ్ అంబాజిడర్‌గా వ్యవహరించినందుకు వచ్చిన డబ్బును కూడా సమాజం కోసం ఉపయోగించాలని, దానికోసమే డబ్బును ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయించాడు.