న్యాయం కోసం కోర్టు మెట్లెక్కనున్న సోనూసూద్

న్యాయం కోసం కోర్టు మెట్లెక్కనున్న సోనూసూద్

sonu-sood1

Sonu Sood: బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ కు నోటీసులు ఇచ్చింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ స్ట్రక్చర్ లో మార్పులు ఉన్నాయని అనుమతి లేకుండానే నిర్మాణం జరిగిందని పేర్కొంది. ఈ నోటీసుపై సోనూ.. ముంబై హైకోర్టును సంప్రదించాడు.

సోనూ.. గత నెల ఫైల్ చేసిన పిటిషన్లో అడ్వకేట్ డీపీ సింగ్.. ఆరు అంతస్థుల శక్తి సాగర్ బిల్డింగ్ లో ఎటువంటి అక్రమ, గుర్తింపు లేని నిర్మాణం జరగలేదని అంటున్నారు. సింగిల్ బెంచ్ అధ్యక్షతన జస్టిస్ పృథ్వీరాజ్ చావన్ పిటిషన్ గురించి రేపు (డిసెంబర్ 11)న వాదన విననున్నారు.

బీఎంసీ నుంచి వారెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత పిటిషనర్ ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం ఆ మార్పులు మహారాష్ట్ర రీజనల్, టౌన్ ప్లానింగ్ (ఎమ్మార్టీపీ) చట్ట ప్రకారమే జరిగాయని సోనూ తరపు న్యాయవాది అంటున్నారు.

గతేడాది అక్టోబరులో ఇచ్చిన నోటీసుపై ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అప్పుడే సివిల్ కోర్టును సంప్రదించి ఊరట ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ చేశాడు. జనవరి 4న బీఎంసీ.. జుహూ పోలీస్ స్టేషన్లో సోనూసూద్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించింది. అనుమతి లేకుండా రెసిడెన్షియల్ బిల్డింగ్ ను హోటల్ గా మార్చారని ఫిర్యాదు చేసింది.

సోనూ సూద్ తన నటనతో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో మెప్పించారు. అంతేకాకుండా కరోనా లాంటి కష్టసమయంలో వలస కార్మికులను ఆదుకుని, పలు రకాలుగా సాయం చేశారు.