Nisarga తుఫాన్ రాకకు సోనూసూద్ ప్లాన్ ఏంటో తెలుసా..

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 01:33 PM IST
Nisarga తుఫాన్ రాకకు సోనూసూద్ ప్లాన్ ఏంటో తెలుసా..

బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్.. సోనూ సూద్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. లాక్‌డౌన్‌లో బయటి ప్రాంతాల్లో ఇర్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చే ప్రయత్నం చేశాడు. ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి చాలా పెద్ద సాయమే చేశాడు. దీనికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి భారీ ఎత్తులో స్పందన వచ్చింది. 

ఇదే సందర్భంలో సోనూ సూద్‌పై సరదా సెటైర్లు లేకపోలేదు. అదే రేంజ్ లో మరోసారి సూద్‌ను ఆటపట్టించబోతే అతని సెన్సాఫ్ హ్యూమర్ తో లైట్ తీసుకుని రిప్లై ఇచ్చాడు. ట్విట్టర్లో ఓ ఫొటో పోస్టు చేసి సోనూ సూద్.. నిసర్గ సైక్లోన్ వెయిట్ చేస్తున్నాడు. అది రాగానే దాన్ని కూడా ఇంటికి పంపించేస్తాడని కామెంట్ పెట్టాడు. దానిపై స్పందించిన సోనూ.. అవును.. దాన్ని కూడా వదిలిపెట్టేసి వస్తా’ అంటూ స్మైలీ పెట్టాడు. 

రెండు వారాల గ్యాప్‌లో దేశాన్ని వణికించిన రెండో అతి పెద్ద తుఫాన్ నిసర్గ. కొద్ది రోజుల ముందే పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వచ్చిన తుఫాన్ అతలాకుతలం చేసింది. నిస‌ర్గ తుఫాన్‌ అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల  మ‌హారాష్ట్ర‌లోని అలీబాగ్ వ‌ద్ద కుండపోతగా వ‌ర్షం కురుస్తోంది. దక్షిణ గుజరాత్ తీరం వైపు దూసుకువెళ్తున్ననిసర్గ  మ‌రో మూడు గంట‌ల్లో తీరం దాట‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. 

ముంబై స‌మీపంలో ఉన్న అలీబాగ్ వ‌ద్ద సుమారు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరి పడుతున్నాయి. చెట్లు స్తంభాలు నేల కొరుగుతున్నాయి. సముద్ర తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి.  తుఫాన్ నేప‌థ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.