Sonu Sood : హోటల్ ఇల్లీగల్ అంటూ సోనూసూద్‌కు బీఎంసీ మళ్లీ నోటీసులు

మేం అక్టోబర్ 20నాడు బిల్డింగ్ ను చెక్ చేశాం. పనులు జరుగుతున్నాయని మీరు లెటర్ లో చెప్పినప్పటికీ..

Sonu Sood : హోటల్ ఇల్లీగల్ అంటూ సోనూసూద్‌కు బీఎంసీ మళ్లీ నోటీసులు

Sonu Sood

Sonu Sood : కరోనా వారియర్, సినీ నటుడు సోనూసూద్ కు మరోసారి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఆరు అంతస్తుల బిల్డింగ్ లో సోనూసూద్ హోటల్ ను నడుపుతున్నారనీ.. దానిని బిల్డింగ్ ప్లాన్ ప్రకారం నివాస భవంతిగా మార్చుతానన్న మాటను ఇంకా నిలబెట్టుకోలేదని నోటీసులో గుర్తుచేసింది కార్పొరేషన్. నవంబర్ 15, 2021న ఈ నోటీసులు పంపింది. వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్ ను కొనసాగించాలని నోటీసులో సూచించింది BMC.

Read This : Sonu Sood : సోనూసూద్ సంచలన ప్రకటన.. రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్నికల్లో పోటీ

మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు సోనూసూద్ పై గతంలో బీఎంసీకి కంప్లయింట్ చేశారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ ను గర్ల్స్ హాస్టల్ గా మార్చారని.. హోటల్ నడుపుతున్నారని.. ఇది ఇల్లీగల్ అని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ భవంతిని కూల్చేయాలని కోరారు. దీనిపై 2021 ఆరంభంలోనే బీఎంసీ-సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఇష్యూ వెళ్లింది. భవనంలో హోటల్ నడపడం ఇల్లీగల్ అని హైకోర్టు కామెంట్ చేసింది. దీంతో.. సుప్రీంకోర్టులో తన పిటిషన్ ను సోనూసూద్ వెనక్కి తీసుకున్నారు. అధికారులు చెప్పినట్టుగా తొందర్లోనే బిల్డింగ్ ను రీస్టోర్ చేస్తానని కోర్టుకు, బీఎంసీకి తెలుపుతూ లెటర్ ఇచ్చారు.

Read This : Sonu Sood : సోనూసూద్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

ఆ లెటర్ లో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ… తాజాగా సోనూసూద్ కు నోటీసు పంపించింది బీఎంసీ. “ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారం 1 నుంచి 6 అంతస్తులను రెసిడెన్షియల్ పర్పస్ లోనే ఉపయోగిస్తానని గతంలో మీరు లెటర్ ఇచ్చారు. మేం అక్టోబర్ 20నాడు బిల్డింగ్ ను చెక్ చేశాం. పనులు జరుగుతున్నాయని మీరు లెటర్ లో చెప్పినప్పటికీ.. ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. హోటల్, హాస్టల్ లనే కంటిన్యూ చేస్తున్నారు.” అని నోటీసులో ఉంది. దీనిపై బదులిచ్చేందుకు మరోసారి వారం రోజుల గడువు ఇచ్చింది బీఎంసీ. సోనూసూద్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది.