ఒక్క ఫోన్ చెయ్యండి.. ఆక్సిజన్ వచ్చేస్తుంది – సోనూసూద్

ఒక్క ఫోన్ చెయ్యండి.. ఆక్సిజన్ వచ్చేస్తుంది – సోనూసూద్

Sonusood

కరోనా సమయంలో మెస్సయ్యగా మారిపోయిన సోనూసూద్.. కష్టం అంటే వచ్చేస్తున్నాడు. బెడ్, ఆక్సిజన్ ఏదైనా సరే అవసరం అయితే నేనున్నా అంటూ దేశమంతా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు విడవకూడదు అనే లక్ష్యంతో ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. మీకు ఆక్సిజన్‌ ఇచ్చేస్తా అంటూ ప్రకటించారు సోనూసూద్‌. ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తూ దొరకని పరిస్థితిలో ఫోన్ చేస్తే.. ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తానని చెప్పారు.

ఫ్రాన్స్‌తో పాటు పలుదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లకు ఆర్డర్లు ఇచ్చిన సోనూసూద్.. ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. ఆక్సిజన్‌ కావాల్సిన వాళ్లు తనను సంప్రదించాలని అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పిన సోనూసూద్.. ఎక్కువ సంఖ్యలో జనం కరోనాతో పోరాడుతున్నారని, చాలామందికి ఆక్సిజన్‌ అందించాల్సి వస్తుందని అన్నారు. అందుకే.. వారికి ఆక్సిజన్‌ అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అవసరం ఉన్నవాళ్లు ఈ నంబర్‌ (022-61403615)కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలని, ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తామని సోనూ చెప్పుకొచ్చారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు వచ్చేస్తున్నాయని, ఢిల్లీలో మరిన్ని ప్రాణాలు కాపాడుకుందామని అన్నారు.