Punjab Elections: పంజాబ్ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

ప్రముఖ నటుడు సోను సూద్ రాజకీయ రంగప్రవేశం చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Punjab Elections: పంజాబ్ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

Sonu Sood

Punjab Elections 2022: ప్రముఖ నటుడు సోను సూద్ రాజకీయ రంగప్రవేశం చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సోనూ దగ్గరవుతుండగా.. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అందులో వాస్తవమెంత అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు.. కానీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోను సూద్ చెల్లెలు ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మాళవిక కచ్చితంగా పోటీ చేస్తున్నట్లు తెలసినా.. ఏ పార్టీ నుంచి, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ప్రకటించాల్సి ఉంది. మాళవిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందని సోనూసూద్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో మాళవిక ఉన్న ఫోటో కూడా వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో మాళవికతో పాటు సోదరుడు సోనూసూద్ కూడా ఉన్నారు.

ఇటీవల, కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ను ప్రకటించారు. కరోనా కాలంలో సోనూసూద్‌తో కలిసి పనిచేయడం ద్వారా మాళవిక వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో.. రాజకీయాల్లోకి రావడానికి నాకు అభ్యంతరం లేదని, అయితే ఇప్పుడు ప్రజాసేవను విస్తృతం చేయాలని మాళవిక చెప్పింది. ఇప్పటికీ సోనూసూద్‌తో కలిసి బాధితులకు సహాయం చేయడంలో ఆమె ముందుంటుంది.

Thyroid : థైరాయిడ్ లక్షణాలు…నివారణ చిట్కాలు