క్షమాపణలు చెప్పిన Sony TV : బిగ్‌బి KBC బైకాట్.. ట్విట్టర్ ఫైర్

  • Edited By: sreehari , November 8, 2019 / 01:46 PM IST
క్షమాపణలు చెప్పిన Sony TV : బిగ్‌బి KBC బైకాట్.. ట్విట్టర్ ఫైర్

బాలీవుడ్ మెగాస్టార్ హోస్టుగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి 11 సీజన్ (KBC)పై ట్విట్టర్ మరోసారి ఫైర్ అయింది. కేబీసీ షోలోని ఒక ఎపొసిడ్‌లో అడిగిన ఓ ప్రశ్నపై ట్విట్టర్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేబీసీ బైకాట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

కేబీసీలో మరాఠా ప్రభువు చత్రపతి శివాజీని అవమానించారంటూ వీక్షకులు మండిపడ్డారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్విట్టర్ యూజర్లు #Boycott_KBC అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మెగల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబుకు సమీకాలనుడుగా ఉన్నది ఈ కింద పాలకుల్లో ఎవరు? అనే ప్రశ్నకు అడిగిన 4 ఆప్షన్లలో చివరిదిగా (D) శివాజీ అని ఉంది. మిగిలిన మూడు ఆప్షన్లలో (A) మహారాణా ప్రతాప్, (B) మహారాణా రంజిత్ సింగ్, (C) రాణా సంగా అని పేర్లు ఉన్నాయి.

వీటిన్నింటికి పూర్తి పేర్లు ఇచ్చి.. చత్రపతి శివాజీ కాకుండా కేవలం (D) శివాజీ అనే ఆప్షన్ ఇవ్వడం పట్ల నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. తమ పాలకుడు చత్రపతి అని సంబోధించకపోవడం ఆయన్ను అవమానించనట్టే భావిస్తూ ట్విట్టర్లో కేబీసీ షోను బైకాట్ చేయాలని డిమాండ్ చేశారు. 

#Boycott_KBC అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీనిపై స్పందించిన సోనీ టీవీ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. కేబీసీ 11 ప్రసారమైన ఎపిసోడ్ లో జరిగిన తప్పిదానికి చింతిస్తున్నట్టు తెలిపింది. వీక్షకుల మనోభవాలను దృష్టిలో పెట్టుకుంటామని, ఇకపై ఇలాంటి తప్పులు జరగబోవని సోనీ టీవీ హామీ ఇచ్చింది.