చిటికెలో పాన్ కార్డు: ఆధార్ ఒక్కటి చాలు

చిటికెలో పాన్ కార్డు: ఆధార్ ఒక్కటి చాలు

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్)ను మరింత ఈజీ చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న క్షణాల్లోనే పాన్ మన చేతికొస్తుంది. అంటే ఇక పాన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి కొద్ది వారాల్లో రానున్న ఈ సర్వీసుతో ఆధార్ కార్డు డేటా ఎంటర్ చేస్తే చాలు. ఈ పాన్ రెడీ అయిపోతుంది. 

ఎలక్ట్రానిక్ పాన్(ఈ పాన్) ఉచితంగా అందించేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ ముందుకొచ్చింది. పాన్ కార్డు కోసం ఆధార్ డేటా ఎంటర్ చేసి ఓటీపీ పొందాలి. ఆ తర్వాత అందులో అడ్రస్ తో పాటు తండ్రి పేరు, జన్మతేదీ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు మరింకేం డాక్యుమెంట్ అవసర్లేదు. 

క్షణాల్లో పాన్ కార్డు జనరేట్ అయిపోతుంది. ఒకసారి పాన్ కార్డు క్రియేట్ అయిపోయిన తర్వాత డిజిటల్ సంతకం చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డును ఎక్కడైనా వాడుకోవచ్చు. అదెలా అంటే ఇష్యూ అయిన పాన్ కార్డులో మన ఫొటో పక్కనే డెమోగ్రాఫిక్ డేటా ఉంటుంది. దానిని స్కాన్ చేసి వాడుకోవచ్చు. దీనిని డిజిటల్ ఫొటోషాపింగ్ లో ఫోర్జరీ చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 
 
సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత అన్నీ ట్రాన్సాక్షన్లకు పాన్ తప్పనిసరిగా మారిపోయింది. ఈ మేరకు పాన్ వచ్చే పద్ధతిని మరింత సునాయసంగా మారుస్తుంది ప్రభుత్వం.