ప్రమాదకర రోడ్లు ఉన్న దేశాల్లో భారత్ కు 4వ స్థానం

ఇంటర్​నేషనల్​ డ్రైవర్​ ఎడ్యుకేషన్​ కంపెనీ "జుటోబీ"తాజాగా చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది.

ప్రమాదకర రోడ్లు ఉన్న దేశాల్లో భారత్ కు 4వ స్థానం

South Africa

South Africa ఇంటర్​నేషనల్​ డ్రైవర్​ ఎడ్యుకేషన్​ కంపెనీ “జుటోబీ”తాజాగా చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది. 56 దేశాలతో చేపట్టిన ఈ సర్వేలో..అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో థాయిలాండ్​, అమెరికా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్..​ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక, అత్యంత సురక్షితమైన రహదారులు ఉన్న దేశాల్లో నార్వే తొలిస్థానంలో, జపాన్​ రెండో స్థానంలో,స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయని జుటోబి తాజా సర్వే పేర్కొంది. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించేవారి సంఖ్య, సీటు బెల్టు పెట్టుకుని కారు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ఆధారణంగా దేశాలకు ర్యాంకులు కేటాయించింది.

అయితే, జుటోబీ చేసిన ఈ అధ్యయనాన్ని దక్షిణాఫ్రికాలో రోడ్డు ట్రాఫిక్ చట్టాలు మరియు వాటి అమలను మెరుగుపర్చేందుకు కృష్టి చేసే NGO “దక్షిణాఫ్రికా జస్టిస్​ ప్రాజెక్ట్​(జేపీఎస్​ఏ)”ఛైర్మన్​ డెంబోస్కీ తప్పుబట్టారు. పాత డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారని విమర్శించారు. డ్రైవింగ్​ చేసేందుకు ప్రమాదకరమైన దేశాల జాబితా తయారు చేసేటప్పుడు సమతూకం పాటించాలన్నారు. ఆఫ్రికా ఖండంలో కేవలం దక్షిణాఫ్రికానే ఈ జాబితాలో ఉంది? మిగతావి ఎందుకు లేవని ప్రశ్నించారు.