వయనాడ్ నుంచి అందుకే పోటీ చేస్తున్నా

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

వయనాడ్ నుంచి అందుకే పోటీ చేస్తున్నా

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం(ఏప్రిల్-2,2019) కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది.
Read Also : ధర్మం..అధర్మం మధ్య పోటీ : సింహం ఒంటరిగానే పోటీ – విజయమ్మ

ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసే విషయాన్ని రాహుల్‌ ప్రస్తావిస్తూ…ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమను శత్రువులా చూస్తున్నారని దక్షిణాది ప్రజలు భావిస్తున్నారు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదని  ఆవేదన చెందుతున్నారు.

వారికి నేను అండగా ఉంటా. ఆ సందేశాన్ని ప్రజలకు తెలియజేసేందుకే వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నాను అని రాహుల్‌ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని, విభజనకు పాల్పడిందని రాహుల్‌ ఆరోపించారు.ఐక్య భారతాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్‌ పని చేస్తోందని రాహుల్ తెలిపారు.

Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు