Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 3 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో అంటే

దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం.

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 3 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో అంటే

Vande Bharat Express : దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే.. మరో 3 సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం.

దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్ రైలును చైన్నై, బెంగళూరు, మైసూరు మధ్య గతేడాది నవంబర్ లో ప్రారంభించగా ఇటీవలే సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైలు సర్వీస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రైలు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది.

Also Read..Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి

మరోవైపు కర్నాటక, తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగబోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు వీలుగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మరో మూడు వందే భారత్ రైళ్లు రావడం అంటే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది మరో భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మిగతా ట్రైన్ల కంటే వేగంగా ప్రయాణిస్తూ త్వరగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు ఏసీ, వైఫై సౌకర్యంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ ట్రైన్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రోజూ ఈ ట్రైన్‌ ప్రయాణికులతో సందడిగా కనిపిస్తోంది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైళ్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు నడపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని రైల్వే అధికారుల భావన. అంతేకాకుండా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా త్వరగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక, సికింద్రాబాద్-తిరుపతి సర్వీస్ వల్ల రైల్వేశాఖకు కూడా ఆదాయం భారీ మొత్తంలో వస్తుంది.

ఇక బెంగళూరు, పుణెలకు కూడా ప్రయాణికుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పుణెల మధ్య వందే భారత్ రైళ్లు నడపనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, పుణెలకు చాలా ట్రైన్లు నడుస్తుండగా.. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు ఆక్యూపెన్సీ సరిపోవడం లేదు. దీంతో ఆ రెండు నగరాలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వందే భారత్ రైలు ప్రత్యేకతలు..
* ఈ రైలు బయటి రూపు ఏరో డైనమిక్ డిజైన్ తో రూపొందించారు.
* గరిష్టంగా 180 కిమీ వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు.
* ఈ వేగాన్ని ప్రయోగదశలో మాత్రమే పరీక్షించి చూశారు.
* ప్రస్తుతం నిర్వహణ దశలో గరిష్ట వేగం పరిమితి మాత్రం గంటకు 160 కిమీ మాత్రమే ఉంది.
* ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది.
* ఫుల్లీ సస్పెండెడ్ ట్రాన్సాక్షన్ మోటార్ తో రూపొందించిన ఆధునిక బోగీలు.
* రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.(Vande Bharat Express)
* ఈ రైలుకి ప్రత్యేకంగా లోకో మోటివ్ ను జత చేయాల్సిన అవసరం లేదు.
* రైలులో అంతర్భాగంగానే ఇంజిన్ ఉంటుంది.
* ఎంఎంటీఎస్ రైలు తరహాలో లోకో పైలెట్ క్యాబిన్ లో రెండు చివర్ల ఉంటాయి.
* ఇందులో సీట్ల ప్రత్యేకత వేరు.
* 180 డిగ్రీల కోణంలో సీట్లు తిప్పుకోవచ్చు.
* కిటీకి నుంచి బయటకు చూడాలని అనుకున్నప్పుడు సీటు కిటికీ వైపు తిప్పుకోవచ్చు.
* కుటుంబసభ్యులు రెండు సీట్లను పరస్పరం ఎదురెదురుగా తిప్పుకుని కూర్చోవచ్చు.
* కోచ్ లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది.

Also Read.. Vande Bharat Express : ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. సెల్ఫీ కోసం వందే భారత్ ట్రైన్‎ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు

* అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ ప్లే అవుతుంటాయి.
* ఆడియో అలర్ట్ కూడా ఉంటుంది.
* ఆటోమేటిక్ తలుపులు ఉంటాయి. వాటి నియంత్రణ లోకో పైలెట్ వద్దే ఉంటుంది.
* మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు.
* ఇలా రైలు ఆగిన కొన్ని క్షణాల్లోనే డోర్లు తెరుచుకుంటాయి.
* బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు డోర్లు మూసుకుంటాయి.
* లోపలి వైపు, బయటి వైపు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.
* లోపల వైఫై వసతి ఉంటుంది.
* రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొట్టుకోకుండా కవచ్ పరిజ్ఞానాన్ని కల్పించారు.
* ప్రతీ కోచ్ లో 4 ఎమర్జెన్సీ లైట్లు.(Vande Bharat Express)
* విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు వెలిగే విధంగా లైట్ల డిజైన్.
* ఈ రైల్లో ప్రస్తుతానికి చైర్ కార్ మాత్రమే ఉంటుంది.
* సాధారణ రైళ్లలాగా స్లీపర్ బెర్తులు ఉండవు.
* అందువల్ల వీలైనంత దగ్గర స్టేషన్ల మధ్యలోనే తిరుగుతాయి.
* రాత్రి వేళ ప్రయాణం లేదు.
* సాధారణంగా దూర ప్రాంతాల మధ్య రాత్రి వేళ ప్రయాణాన్నే జనం కోరుకుంటారు.
* నిద్ర సమయంలో ప్రయాణాన్ని ముగించడం ద్వారా పగటి పూట పనులు చూసుకోవచ్చని భావిస్తారు.
* కానీ, వందే భారత్ రైలు పగటి వేళ మాత్రమే ప్రయాణించాల్సి రావడం ఓ ప్రతికూల అంశం.
* దీంతో తదుపరి రైల్లో బెర్తులు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే అధికారులు.
* వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు.(Vande Bharat Express)
* ఇందులో 14 ఏసీ చైర్ కార్లు, 2 బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లు.
* ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లో 104 సీట్లు.
* ఎకానమీ క్లాస్ లో 1024 సీట్లు.
* మొత్తంగా ఈ రైల్లో ఒకేసారి 1128 మంది ప్రయాణం చేయొచ్చు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.