దక్షిణాది కుంభమేళా : కర్ణాటకలో నేటి నుంచి 3 రోజులు

  • Published By: chvmurthy ,Published On : February 17, 2019 / 04:30 AM IST
దక్షిణాది కుంభమేళా : కర్ణాటకలో నేటి నుంచి 3 రోజులు

మైసూరు: దక్షిణాది కుంభమేళా ఆదివారం నుంచి కర్ణాటక లో ప్రారంభమవుతుంది.  మైసూరు సమీపంలోని టీ.నరసీపుర పట్టణం వద్ద కావేరి, కపిల, స్పటిక  నదుల సంగమం వద్ద నేటి నుంచి 3 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఈవేడుక కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కుంభ మేళాకు వచ్చే భక్తుల కోసం సైనికులు తాత్కాలిక వంతెన నిర్మించారు.  కావేరి నది ఒడ్డు నుంచి సంగమ ప్రాంతం వరకు భక్తులు వెళ్లేందుకుఈ వంతెన నిర్మించారు. కపిల, స్పటిక నదులు ఈ ప్రాంతంలో అంతర్వాహినీ గా పయనిస్తుంటాయని భక్తుల నమ్మకం. దాదాపు 10 లక్షలమంది భక్తులు పుణ్యాస్నానాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. సీఎం కుమార స్వామితో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేస్తారని తెలుస్తోంది. 

ఉత్తరాది కుంభమేళా ప్రయాగ, నాసిక్,హరిద్వార్, ఉజ్జయినిల్లో జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన  ఈ వేడుకను 1989 వ సంవత్సరం నుంచి  ప్రతి మూడేళ్లకొసారి ఇక్కడ నిర్వహిస్తున్నారు. సుమారు 60 మంది పీఠాధిపతులు,పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, నాగసాధువులు ఈకుంభమేళాకు హాజరవుతారని సమాచారం. స్ధానికంగా ఉన్న బిక్షేశ్వర,మూల స్ధానేశ్వర, అగస్తీశ్వర, గుంజ నరసింహ స్వామి వారి ఆలయాలను కుంభమేళా కోసం  కొత్త రంగులతో అలంకరిచారు. మైసూరు జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. 20 పడకలతో  ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.