Family Debts : దక్షిణాది రాష్ట్రాలు..కుటుంబ అప్పులు పెరుగుతున్నాయి

దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది.

Family Debts : దక్షిణాది రాష్ట్రాలు..కుటుంబ అప్పులు పెరుగుతున్నాయి

Debts

Southern States : దక్షిణ రాష్ట్రాల కుటుంబాలు అధిక రుణభారాన్ని మోస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల కుటుంబాలపైనే ఈ భారం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత కుటుంబాలపై రుణభారం విషయంలో తెలంగాణ టాప్‌లో ఉంది. 2019 లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా 67.2 శాతం గ్రామీణ కుటుంబాలు రుణభారాన్ని మోస్తుండగా.. 6.6 శాతంతో అట్టడుగు స్థానంలో నాగాలాండ్‌ గ్రామీణ ప్రాంతముంది. ఇక పట్టణ కుటుంబాల విషయాలనికొస్తే మొదటి స్థానంలో 47.8 శాతంతో కేరళ ఉండగా… 5.1 శాతంతో చివరి స్థానంలో మేఘాలయ రాష్ట్రం ఉంది. 2013 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వే డాటా ప్రకారం ఇండియా రేటింగ్స్‌ ఈ వివరాలు వెల్లడించింది.

Read More : peon job..15 lakh applications : ప్యూన్‌ ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు..అందరూ డిగ్రీ,పీజీలు చేసినవారే

కుటుంబాలపై రుణభారం ఎక్కువగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో కూడా దేశంలో ఇతర రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక మినహా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణలో గ్రామీణ, పట్టణ కుటుంబాలకు అత్యధికంగా ఆస్తి నిష్పత్తి కలిగి ఉన్నాయి. ఇక కర్ణాటకలో మొత్తం భారతదేశ సగటు కంటే ఎక్కువ ఆస్తి నిష్పత్తి ఉంది. ఈ వివరాలను బట్టి దక్షిణాది రాష్ట్రాల్లో అధిక శాతం కుటుంబాలు అప్పుల పాలైనట్లు సూచిస్తోంది.

Read More : Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?

సాధారణంగా ఈ పరిస్థితులు ఆర్థిక దుర్బలత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. అధిక అప్పులు, సేవలను తీసుకునే సామర్ధ్యం కూడా తమకుండే ఆస్తి మీద ఆధారపడి ఉంటుంది. జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే దక్షిణాది రాష్ట్రాల తలసరి ఆదాయం ఎక్కువ.
కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా కుటుంబ రుణాలు బాగా పెరియాని డాటా వెల్లడిస్తోంది. ఆర్బీఐ డేటా ప్రకారం… జీడీపీలో గృహరుణం నిష్పత్తి గత ఏడాది నాలుగో త్రైమాసికం కంటే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పెరిగిందని సూచిస్తోంది.