Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో అంటే మే 29న కేరళను తాకనున్నట్లు వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఈమేరకు ఐఎండీ వాతావరణ విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అండమాన్ నికోబర్ దీవులను దాటిన రుతుపవనాలు..బలమైన గాలుల ప్రభావంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, సహా కొమొరిన్ పై విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గాలుల్లో స్థిరత్వం, వేగం ఇలానే కొనసాగనున్న నేపథ్యంలో మే 29-30 మధ్య రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. తాజా వాతావరణ సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతం అయింది.
Southwest Monsoon has further advanced into some more parts of South Arabian Sea, entire Maldives & adjoining areas of Lakshadweep and some more parts of Comorin area. pic.twitter.com/MJjNd6Dn6Y
— India Meteorological Department (@Indiametdept) May 27, 2022
అందువల్ల, రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం మరియు లక్షద్వీప్ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించేందుకు మరిన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు IMD తెలిపింది. కాగా, మే 29 వరకు కేరళలో వివిధ జిల్లాలకు జారీచేసిన ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ ఉపసంహరించుకుంది. మరోవైపు..ఉత్తర భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఆయా రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముధూళితో కూడిన గాలులు వీస్తూ..భారీ వర్షాలు కురుస్తున్నాయి.
other stories:
- Southwest Monsoon: మరో రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు..
- Monsoon Alert : ఏపీ, తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజుల్లో రుతుపవనాల ప్రవేశం
- Normal Monsoons: ఈ ఏడాది సాధారణంగానే రుతుపవనాలు, వర్షపాతం
- Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
- Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
1Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
2Wheat Flour: గోధుమ, మైదా పిండి ఎగుమతులపై భారత్ ఆంక్షలు
3Prawn In The Nose : ముక్కులో దూరిన రొయ్య
4Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
5Sri Lanka: శ్రీలంకలో హింస.. ఆ దేశానికి వెళ్ళొద్దు: తమ పౌరులకు యూకే, న్యూజిలాండ్ సూచన
6Anupama Parameswaran: వామ్మో.. అనుపమను ఇంత స్టైలిష్‌గా చూశారా..?
7Karnataka: పట్టాలపై ట్రక్కు.. ఢీకొట్టిన రైలు.. వీడియో
8Chintamaneni Prabhakar : కోడి పందాలతో నాకేం సంబంధం లేదు-చింతమనేని
9The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
10Bihar: ఆరేళ్ళ విద్యార్థిని చావబాదిన ఆ టీచర్ అరెస్ట్
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?