Sovereign Gold Bond Scheme : అదిరిపోయే స్కీమ్.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలపై పన్ను పడదు

దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Sovereign Gold Bond Scheme : అదిరిపోయే స్కీమ్.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలపై పన్ను పడదు

Sovereign Gold Bond Scheme

Sovereign Gold Bond Scheme : దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఓ స్కీమ్ ఉంది. దానిపై పెట్టుబడి పెడితే అందులో వచ్చే ప్రాఫిట్ పై ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. అదే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్ల కోసం 2015లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకాన్ని ప్రారంభించింది. సావరిన్‌ గోల్డ్ బాండ్‌ నాలుగో దశ సబ్‌స్రిప్షన్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ ధరను ఒక గ్రాముకు రూ. 4,807గా ఆర్బీఐ నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకి రూ.50 తగ్గింపు రానుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2021-22 నాలుగో దశ సబ్‌స్క్రిప్షన్‌ జూలై 16తో
ముగియనుంది. గోల్డ్‌ బాండ్లపై ఇన్వెస్టర్లకు 2.5 శాతం వార్షిక వడ్డీరేటును అందించనుంది. బాండ్లపై వచ్చే మెచ్యూరిటీ తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి
పన్ను ఉండదు. కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2015 నుంచి సుమారు రూ.25 వేల కోట్లను రాబట్టింది.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్ ముఖ్యమైన విషయాలు..
* ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్‌ చేస్తే డిజిటల్‌ రూపంలో లేదా పేపర్‌ రూపంలో బ్యాంకులు బాండ్లను ఇస్తాయి.
* కరోనా వైరస్‌ కారణంగా యూఎస్‌ ట్రెజరీ దిగుబడి 4 నెలల కనిష్టానికి పడిపోవడంతో బంగారం ధర గత మూడు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది.
* ఈ బాండ్లను దగ్గరలో ఉన్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), సెలక్టడ్‌ పోస్టాఫీసుల్లో,
బాంబే స్టాక్‌ ఎక్స్చేంజీ, నేషనల్‌ స్టాక్స్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.
* గోల్డ్‌ బాండ్లకు ఎనిమిదేళ్ల టైమ్ పీరియడ్‌ ఉంటుంది. బాండ్లను తీసుకుని ఐదేళ్లు గడిస్తే వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఆ సమయంలో బంగారానికి ఉన్న రేట్లను పొం‍దుతారు.
* ఈ బాండ్లపై ఒక వ్యక్తి చేసే కనిష్ట పెట్టుబడి విలువ ఒక గ్రాము, గరిష్ట పెట్టుబడి విలువ 4 కిలోలుగా ఉంటుంది. కాగా హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు,
ట్రస్ట్‌లకు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు.
* మీరు కొనుగోలు చేసే గోల్డ్‌ బాండ్లపై ప్రభుత్వ షురిటీ ఉంటుంది.