Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.

Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!

Sovereign Gold Bond

Sovereign Gold Bond Scheme: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ సమయంలో బాండ్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది బ్యాంకు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం బాండ్లను ఏడో సారి ఇవ్వనుంది బ్యాంకు. ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్‌ 29వ తేదీ వరకూ ఈ బాండ్లు అందుబాటులో ఉండనున్నాయి. నవంబర్‌ 2న బాండ్‌ జారీ అవుతుంది.

ఆన్‌లైన్‌లో ఈ బాండ్లను కొనుగోలు చేస్తే, డిజిటల్ పద్ధతిలో ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 చొప్పున రాయితీ కూడా వస్తుంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించి ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది. బ్యాంకు ద్వారా సబ్‌స్క్రైబ్ కావొచ్చు. పోస్టాఫీస్‌లలో కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్.. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. పసిడి బాండ్స్‌పై పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ రెండు దఫాలుగా చెల్లించబడుతుంది. ఇది ఇష్యూ జారీ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు.

పన్ను వర్తింపు, సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను రాయితీ ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పెట్టుబడిదారులను భౌతిక బంగారు పెట్టుబడుల నుండి బాండ్స్ వైపు ప్రోత్సహించేందుకు అందించే ప్రత్యేక ఆదాయ పన్ను ప్రయోజనం. మూలధన లాభాల పన్ను నుంచి పన్ను మినహాయింపు గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో లేదు.

బాండ్ కాలపరిమితి బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు కాగా ముందే నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. గోల్డ్ బాండ్‌లపై వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను విధించబడుతుంది. ఒక వ్యక్తికి ఈ బాండ్ల విముక్తిపై తలెత్తే మూలధన లాభాలు మినహాయించబడుతాయి.