EVMలను బీజేపీ ట్యాంపరింగ్ చేయకపోతే…కూటమిదే విజయం

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 02:30 PM IST
EVMలను బీజేపీ ట్యాంపరింగ్ చేయకపోతే…కూటమిదే విజయం

ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్‌ బంద్‌ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి సంయుక్తంగా ప్రచార ర్యాలీ నిర్వహించింది. బీఎస్పీ చీఫ్ మాయవతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌ లు ర్యాలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాయావతి.చౌకీదార్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాటకాలాడుతున్నారని మాయా విమర్శించారు.ధనవంతులకే మరింత ధనం ఇవ్వడంపైనే మోడీ దృష్టి పెట్టారని,ధనవంతులకు మాత్రమే మోడీ చౌకీదార్‌ గా ఉంటున్నారన్నారు. 2014కు ముందు ఇచ్చిన హామీలను మోడీ సర్కార్ నెరవేర్చలేదన్నారు.బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో కూటమి చేతిలో ఓడిపోవడం ఖాయం అని తెలిపారు.ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపించారు.

యూపీలో  ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేయకూడదన్నారు.కాంగ్రెస్‌కు ఓట్లేయడం వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీ లబ్ది పొందే అవకాశముందని, బీజేపీని ఓడించేది ఎస్పీ, బీఎస్పీ కూటమి మాత్రమేనని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కూటమే తప్ప కాంగ్రెస్ కాదన్నారు.షహరాన్‌ పూర్ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చెబుతూ.. ఇక్కడ కూటమిని ఓడించడానికి కాంగ్రెస్ ఓ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టిందని మాయావతి ఆరోపించారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయ పథకం(న్యాయ్)పై మాయా ఘాటు విమర్శలు చేశారు.న్యాయ్ విఫలమయ్యే ఆలోచన అని ఆమె అన్నారు.దరిక నిర్మూలనకు న్యాయ్‌ పరిష్కారం చూపదన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ…కాంగ్రెస్,బీజేపీకి పెద్ద తేడా లేదన్నారు.వాళ్ల పాలసీలు చూస్తే..ఆ రెండు పార్టీలు ఒకటే అన్న విషయం అర్థమవుతోందన్నారు.దేశంలో మార్పు తీసుకురావడం కోసమే యూపీలో గ్రాండ్ అలయెన్స్ గా ఏర్పడి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇస్టం లేదన్నారు.యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని అఖిలేష్ అన్నారు.