Akhilesh Yadav: పోలీసులు ఇచ్చిన టీ తాగని అఖిలేష్ యాదవ్.. విషం కలిపారేమో అంటూ అనుమానం
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష్‌కు టీ అందించారు.

Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన టీ తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని అఖిలేష్ అనుమానం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
Pawan Kalyan: ఆ విషయంపైనే చంద్రబాబు, నేను చర్చించాం: పవన్ కల్యాణ్
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష్‌కు టీ అందించారు. అయితే, ఆ టీ తాగేందుకు అఖిలేష్ నిరాకరించారు. ‘‘ఆ టీలో విషం కలిపారేమో ఎవరికి తెలుసు. నేను వీళ్లిచ్చే టీ కాకుండా నాకోసం కార్యకర్తలు తెచ్చే టీనే తాగుతాను. ఈ టీని పోలీసులు తాగుతారా?’’ అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. అనంతరం తన కోసం బయటి నుంచి టీ తీసుకురావాల్సిందిగా అఖిలేష్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.
పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మనీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై అంతకుముందే మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇక అఖిలేష్ టీ తాగడం నిరాకరించడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడ ట్రెండ్ అవుతోంది.
#WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया।
उन्होंने कहा,”हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।”
(वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82
— ANI_HindiNews (@AHindinews) January 8, 2023