Azam Khan: జైలు నుంచి విడుదలైన 5 నెలలకే మరోసారి జైలుకు! విధ్వేష వ్యాఖ్యలు చేశారంటూ అజాం ఖాన్‭కు 3 ఏళ్ల జైలు శిక్ష

విచారణ సందర్భంగా రాంపూర్ కోర్టు తీర్పు ఇవ్వడానికే ముందు ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కోర్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అజాం ఖాన్‭పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి. అయితే ఇందులోని చాలా కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ రావడం గమనార్హం.

Azam Khan: జైలు నుంచి విడుదలైన 5 నెలలకే మరోసారి జైలుకు! విధ్వేష వ్యాఖ్యలు చేశారంటూ అజాం ఖాన్‭కు 3 ఏళ్ల జైలు శిక్ష

SP MLA Azam Khan sentenced to three years in prison by special court in hate speech case

Azam Khan: చీటింగ్ కేసులో సుమారు 27 నెలలు జైలు శిక్ష అనుభవించి.. ఈ యేడాది మే నెలలో విడుదలైన సమాజ్‭వాదీ పార్టీ సినియర్ నేత అజాం ఖాన్.. మరోసారి జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2019లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭పై విధ్వేష వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అజాం ఖాన్‭ను రాంపూర్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షను రాంపూర్‭లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఖరారు చేసింది. దీంతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించింది.

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల ఉనికికి క్లిష్టమైన వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై నమోదైన కేసులో అజాం ఖాన్‭ను రాంపూర్ కోర్టు దోషిగా తేల్చింది. అయితే అజాం ఖాన్ తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే, 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. క్రిమినల్ కేసులో దోషిగా తేలి రెండేళ్ల జైలు శిక్ష పడితే చట్ట సభల్లో ఉన్న సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది.

ఇక విచారణ సందర్భంగా రాంపూర్ కోర్టు తీర్పు ఇవ్వడానికే ముందు ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. కోర్టు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అజాం ఖాన్‭పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి. అయితే ఇందులోని చాలా కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ రావడం గమనార్హం.

Currency Notes: సరికొత్త వివాదానికి తెరలేపిన కేజ్రీవాల్ వ్యాఖ్యలు.. కరెన్సీ నోట్లపై అంబేద్కర్, మోదీ ఫొటోలు వేయాలంటూ డిమాండ్లు