Indian National Flag : భూమి నుంచి 30 కి.మీ ఎత్తులో భారత జాతీయ జెండా ఆవిష్కరణ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా సంస్థ ఓ బెలూన్‌ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. భూమి మీద నుంచి లక్షా 6 వేల అడుగుల ఎత్తులో పతాకాన్ని ఎగరవేసింది.

Indian National Flag : భూమి నుంచి 30 కి.మీ ఎత్తులో భారత జాతీయ జెండా ఆవిష్కరణ

Indian national flag

Indian National Flag : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా సంస్థ ఓ బెలూన్‌ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. భూమి మీద నుంచి లక్షా 6 వేల అడుగుల ఎత్తులో పతాకాన్ని ఎగరవేసింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌.. హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా సంస్థ.. యువ సైంటిస్టులను తయారుచేస్తోంది.

మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికంగా ఉంటున్న భారతీయులు భారీ ఎత్తున హాజరై దేశభక్తిని చాటుకున్నారు. ఓడరేవుల వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

American Astronaut Wished : అంతరిక్షం నుంచి అమెరికా వ్యోమగామి రాజాచారి..భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

కొందరు అక్కడి యుద్ధ నౌకలపైకి ఎక్కి ఫొటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఐఎన్ఎస్ సూర్య’ అనే భారత యుద్ధనౌక సింగపూర్‌లోని ఛాంగై నౌకా స్థావరానికి చేరుకుంది. అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ తరక్ష్‌పై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అక్కడ నావికాదళ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఐరోపాలోని సముద్ర జలాల్లో ఉన్న ఐఎన్ఎస్ తరంగిణిపై సిబ్బంది జాతీయ పతాకాన్ని ఎగరేశారు.

కెన్యాలోని ముంబాస పోర్టుకు ఐఎన్ఎస్ తబర్ చేరుకోగా, అక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నౌకాశ్రయంలో భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సాగింది. అమెరికాలోని శాన్ డియాగో పోర్టులో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని భారత నావికా దళం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.