SpiceJet Flyers: ఎయిర్‌పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

SpiceJet Flyers: ఎయిర్‌పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

SpiceJet Flyers: ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. శనివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకుంది. 11.24 గంటలకు విమానం ల్యాండ్ అయినప్పటికీ, ప్రయాణికుల్ని తీసుకెళ్లడానికి బస్సు రాలేదు.

Black Magic: కూతురుకు దెయ్యం పట్టిందని.. కొట్టి చంపిన తల్లిదండ్రులు

విమానం నుంచి దిగిన ప్రయాణికులు, అక్కడ్నుంచి బస్సులోనే ఎయిర్‌పోర్ట్ టర్మినల్ చేరుకోవాల్సి ఉంటుంది. బస్సును ఎయిర్‌పోర్టుతోపాటు, విమానయాన సంస్థ కలిసి ఏర్పాటు చేయాలి. అలాగే భద్రతా కారణాల రీత్యా టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడవడానికి అనుమతి లేదు. కానీ, విమానం ల్యాండ్ అయి 45 నిమిషాలు అయినప్పటికీ బస్సు చేరుకోలేదు. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు నేరుగా టామాక్ ఏరియా నుంచి నడుచుకుంటూ వెళ్లారు. కానీ, వారు ఎయిర్‌పోర్టు టర్మినల్ చేరుకునే లోపే బస్సు వచ్చింది. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులు, నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లు అంతా కలిసి బస్సులోనే తిరిగి వెళ్లారు. కానీ, ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

ఇలా ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లడం నిషేధమని, దీనిపై జవాబు ఇవ్వాలని స్పైస్‌జెట్ సంస్థను ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. తాము బస్సుల కోసం ఎయిర్‌పోర్టు సిబ్బందికి చెప్పినప్పటికీ, అవి రావడం ఆలస్యమైందని, ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పినప్పటికీ వారిలో కొందరు వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్లారని ఆ సంస్థ చెప్పింది. అయితే, వారిని కూడా చివరకు బస్సులోనే తీసుకెళ్లామని వివరించింది.