COVID-19 in Children: రాజస్థాన్, మహారాష్ట్రల్లో పిల్లల్లో వేగంగా పెరుగుతున్న కరోనా.. రోజుల వ్యవధిలో వందల్లో కేసులు

కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..

COVID-19 in Children: రాజస్థాన్, మహారాష్ట్రల్లో పిల్లల్లో వేగంగా పెరుగుతున్న కరోనా.. రోజుల వ్యవధిలో వందల్లో కేసులు

Covid In Children (1)

COVID-19 in Children: కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రాజస్థాన్ లోని దుంగార్పూర్ లో 325మంది పిల్లలో పాజిటివ్ వచ్చింది.

రాజస్థాన్ లోని దౌసా, దుంగార్పూర్ జిల్లాల్లో 600మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాజస్థాన్ లోని భారత్‌పూర్ లో 3వారాల వ్యవధిలో 600మందికి పైగా పిల్లల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

టైమ్స్ నౌ.. హెల్త్ అఫీషియల్స్ లెక్కల ప్రకారం.. రాజస్థాన్ మొత్తంలో దాదాపు 7వేల మందికి పాజిటివ్ ఉండొచ్చని చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదని చెప్తున్నారు. గతంలోనే థర్డ్ వేవ్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం కనబరుస్తుందని చెప్పారు.

ప్రముఖ వైద్య నిపుణులు ఇండియా కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్కే అరోరా మాల్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే. పిల్లల్లో మాత్రమే కాదు. పెద్ద వాళ్లల్లోనూ పాజిటివ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అప్పుడే పుట్టిన శిశువులు, గర్భిణీలు, పిల్లలకు ప్రత్యేకమైన కేర్ ఫెసిలిటీస్ కావాలి. కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీ నెలల నిండకుండానే డెలివరీ చేయించుకోవచ్చు’ అని వెల్లడించారు.