Covid Sputnik-V Cost : భారత్‌లో స్పుత్నిక్-V ఒక డోసు ధర రూ.995.40

రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా వ్యాక్సిన్‌ కొరతతో రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

Covid Sputnik-V Cost : భారత్‌లో స్పుత్నిక్-V ఒక డోసు ధర రూ.995.40

Sputnik V To Cost 995 Shot, Made In India May Be Cheaper (1)

Covid Sputnik-V Cost Cheaper : రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా వ్యాక్సిన్‌ కొరతతో రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది. స్పుత్నిక్-వి టీకా ఒక డోసు ధరను రూ.948గా నిర్ణయించింది. అదే 5 శాతం జీఎస్టీతో కలిపి ఒక డోసు ధరను రూ.995.40లుగా నిర్ణయించింది.

ఎందుకంటే దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు 5 శాతం జీఎస్టీ ఉంటుంది. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్ వి, భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించిన మూడవ టీకా కూడా. దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారుచేయడం ద్వారా దాని ధర తగ్గే ఛాన్స్ ఉంది. వారం రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

టీకా నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ రెండు కొవిడ్ వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ V వ్యాక్సిన్ 91.6 శాతం అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది.